Balakrishna: బాలయ్య107 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ విజయంతో ఫుల్ స్వింగ్లో ఉన్నారు. అదే జోష్ లో ఆయన తర్వాతి సినిమాని కూడా స్టార్ట్ చేశారు. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకుడు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైంది. ఫస్ట్ లుక్ ను కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో బాలయ్య మాస్ లుక్ అదిరింది. ‘వీర సింహా రెడ్డి’ అనే టైటిల్ ను ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు.

Click Here To Watch

హీరోయిన్ గా శృతీ హాసన్ ను ఎంపిక చేశారు.తమన్ సంగీత దర్శకుడు. ఈ మూవీ గురిం చి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఇది బాలయ్య అభిమానులకి కిక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. విషయం ఏంటంటే… బాలయ్య- గోపీచంద్ మూవీలో ఏకంగా 12 ఫైట్లు ఉంటాయట.ఆల్రెడీ యూ.ఎస్ లో ఓ భారీ చేజ్ సీన్ ను ప్లాన్ చేశారు. దీన్ని చిత్రీకరించడానికి టీం అంతా రెడీగా ఉంది.ఈ యాక్షన్ ఎపిసోడ్ కు భారీగానే ఖర్చు పెడుతున్నట్టు సమాచారం.

బాలయ్య సినిమా అంటే ఫైట్ పడాల్సిన టైంకి ఫైట్ పడాలి.రెండు మూడు సన్నివేశాలకి ఒక హై రేంజ్ ఎలివేషన్ సీన్ కావాలి. దీనినే బోయపాటి పక్కాగా వర్కౌట్ చేసుకుంటున్నాడు. ‘అఖండ’ సినిమాని ఫుల్ గా యాక్షన్ డోస్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కనుక చూసుకుంటే అవే కీ రోల్ పోషించాయి.గోపీచంద్ మలినేని కూడా యాక్షన్ సన్నివేశాలకు,హీరో ఎలివేషన్లకి పెట్టింది పేరు. దానినే బాలయ్య మూవీకి కరెక్ట్ గా అప్లై చేయాలనుకుంటున్నాడు. ‘మైత్రీ మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus