OTT Releses: శాకిని డాకినీ తో పాటు ఈ వీకెండ్ కు ఓటీటీలలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్ట్!

సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఒక్క బ్రహ్మాస్త్రం, ఒకే ఒక జీవితం సినిమాలు తప్ప మిగిలిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. పైగా ఈ నెలలో పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కాలేదు. అందుకే చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా దర్శనమిచ్చాయి. అవి కూడా సరైన బజ్ క్రియేట్ చేయలేదు. దీంతో సెప్టెంబర్ నెల అంతా ఓటీటీలకే పెద్ద పీట వేశారు ప్రేక్షకులు.ఈ వారం కూడా డబ్బింగ్ సినిమాలే థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒక్క పొన్నియన్ సెల్వన్ మూవీ తప్ప మిగిలిన ఏ సినిమాలకి సరైన బజ్. దీంతో ఈ వీక్ కూడా ఓటీటీలకి పెద్ద పీట వేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ వీకెండ్ ఓటీటీ లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) శాకిని డాకిని: నివేదా థామస్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

2) తీర్ పు : ఈ మలయాళం మూవీ సెప్టెంబర్ 30 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

3) కెప్టెన్ : ఆర్య హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

4) ప్లాన్ ఎ ప్లాన్ బి : తమన్నా ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

5) కోబ్రా : విక్రమ్ హీరోగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 28 నుండి సోని లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

6) బ్లోండి : ఈ మూవీ సెప్టెంబర్ 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

7) 777 చార్లీ : రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 30 నుండి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది.

8) బుల్లెట్ ట్రైన్ : ఈ హాలీవుడ్ మూవీ సెప్టెంబర్ 29 నుండి జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

9) కర్మయుద్ధ్ : సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ల్లో స్ట్రీమింగ్ కానుంది.

10) హాకస్ ఫోకస్ : సెప్టెంబర్ 30 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) రేయికి వేయికళ్ళు : సెప్టెంబర్ 30 నుండి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

12) రంగ రంగ వైభవంగా : వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అక్టోబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus