అంకిత్ కొయ్య (Ankith Koyya), శ్రియ (Shriya Kottam) కొంతం హీరో, హీరోయిన్లుగా వెన్నెల కిషోర్ (Vennela Kishore) కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ (14 Days Girlfriend Intlo). శ్రీహర్ష దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమాని సత్య కోమల్ నిర్మించారు. మార్చి 7న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ టాక్ చెప్పారు. డేటింగ్ యాప్ లో పరిచయమైన అహానా (శ్రియ కొంతం) ని కలిసేందుకు వెళ్లిన హర్ష(అంకిత్ కొయ్య) అనుకోకుండా ఆమె ఇంట్లో 14 రోజుల పాటు ఇరుక్కు పోవాల్సి వస్తుంది.
అది ఎందుకు? ఆ 14 రోజులు హీరోయిన్ ఇంట్లో.. హీరోకి ఎదురైన సమస్యలు ఏంటి? అనే అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో రూపొందిన సినిమా ఇది. ఆ లైన్ ను దర్శకుడు శ్రీహర్ష చాలా సెన్సిబుల్ గా డీల్ చేశాడు. తక్కువ పాత్రలతో ఎంటర్టైన్ చేసిన విధానం కానీ,యూత్ మైండ్ సెట్ ఎలా పని చేస్తుంది అనే అంశాలను కానీ అతను ఎంటర్టైనింగ్ గా చెప్పడం అనేది అభినందించే విధంగా ఉంటుంది. అలా అని ఎక్కువగా సాగదీసే సన్నివేశాలు రాసుకోలేదు.
ఈ కథ మొత్తం 95 నిమిషాల రన్ టైంలోనే ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు. అందుకు కూడా దర్శకుడిని అభినందించొచ్చు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు. కచ్చితంగా టైం పాస్ చేసే విధంగానే ఉంటుంది ఈ సినిమా.