Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ హడావిడి అంతా ‘మైత్రి’ వారిదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ టాక్ తో సంబంధం లేకుండా అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అప్పులు, వడ్డీలు, బ్యాంకులు.. అనే యూనివర్సల్ అంశాల చుట్టూ తిరుగుతుంటుంది. అందుకే ఈ సినిమాకి అందరూ బాగా కనెక్ట్ అవుతున్నారని స్పష్టమవుతుంది. అందుకే ప్రమోషన్లను కూడా చిత్ర బృందం ఎక్కువగా చేస్తుంది. మొన్నటికి మొన్న కర్నూల్లో ఓ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.

అలాగే ఈ వీకెండ్ కు విజయవాడ లేదా వైజాగ్లో ఓ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ‘మైత్రి మూవీ మేకర్స్’ తో పాటు ’14 రీల్స్ ప్లస్’ వారు కూడా నిర్మాతలే అన్న సంగతి తెలిసిందే. ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై మహేష్ బాబు కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. అయితే ప్రమోషన్ల విషయంలో ఎక్కువగా ‘మైత్రి’ వారి హడావిడే ఎక్కువ కనిపిస్తుంది.

14 రీల్స్ వారిని మాత్రం మైత్రి వారు పక్కన పెట్టేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహేష్ బాబు అంటే డేట్స్ ఇవ్వడం కోసం తన బ్యానర్ పేరు వేసుకున్నాడు కానీ అతను ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ అంటూ ఏమీ లేదు. కాకపోతే అడ్వాన్స్, రెమ్యునరేషన్ మొదట్లో తీసుకోలేదు.

సినిమా పూర్తయ్యాక తీసుకున్నాడు అని తెలుస్తుంది. అలాగే ప్రమోషన్ల ఖర్చులో కూడా అతను 50 శాతం పెట్టుకుంటున్నాడు అనేది ఇన్సైడ్ టాక్. ఈ అయితే ప్రమోషన్ల విషయంలో ’14 రీల్స్ ప్లస్’ వారే ఎక్కువ కనిపించడం లేదు. హడావిడి అంతా మైత్రి వారిదే కనిపిస్తుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus