ఆంధ్రప్రదేశ్‌లో మరింత దారుణంగా సినిమా పరిస్థితి

కొత్త సినిమా విడుదలకు ముందు అయితే ఎన్ని థియేటర్లలో ఎన్ని థియేటర్లలో రిలీజ్‌ చేస్తున్నారు అనేది రాసేవారు. విడుదలై… 50 రోజులు, 100 రోజులు పూర్తయితే ఎన్ని థియేటర్లలో ఆ సినిమా ఆడింది అని కౌంట్‌ చేస్తారు. తర్వాతి రోజుల్లో ఈ పరిస్థితి లేదు. కేవలం రిలీజ్‌ టైమ్‌లో మాత్రమే స్క్రీన్స్‌ లెక్క రాస్తున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మారింది. రోజుకు ఎన్ని థియేటర్లు మూతబడ్డాయి అనే లెక్క రాసుకోవాల్సి వస్తోంది.

సినిమా టికెట్‌కు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన టికెట్‌ ధరలు చూసి థియేటర్ల యజమానులు మూసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా సినిమా టికెట్‌ రేట్లు పెంచకుండా నియంత్రిస్తున్నాం అంటూ… ఏపీ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతోంది. ఈ క్రమంలో ప్రాంతాల వారీగా థియేటర్లను విభజించి రేట్లు నిర్ణయించింది. ఆ రేట్లు కింది విధంగా ఉన్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్లు

* మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20.

మున్సిపాలిటీలు

* మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15.

నగర పంచాయతీలు

* మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10.

గ్రామ పంచాయతీలు

* మల్టీప్లెక్స్-ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30;

* ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10;

* నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5గా నిర్ణయించారు.

పై ధరల ప్రకారం చూస్తే… థియేటర్ల నిర్వహణ కష్టమని యజమానులు నిర్ణయానికి వచ్చారు. తొలుత పల్లెటూళ్లు, చిన్న పట్టణాల్లో థియేటర్లను మూసేస్తున్నారు. అలా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 175 థియేటర్లు మూసేసినట్లు సమాచారం. మరికొన్ని థియేటర్లు ఈ బాటలో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో థియేటర్ల యజమానులు, నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమయ్యారు. మంగళవారం కలిసి చర్చించనున్నారు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus