ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులకు మే 20 అంటే పెద్ద పండగ రోజు. ఈ ఏడాది ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు రెండు భారీ సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ ‘వార్ 2’తో (War 2) బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు, అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల నుంచి బర్త్‌డే రోజున బిగ్ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. ‘వార్ 2’ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశలో ఉంది.
ఈ బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ‘వార్ 2’ నుంచి ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల చేసే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లో మరింత క్రేజ్ సంపాదించే ఛాన్స్ ఉంది.
మరోవైపు, ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా ‘డ్రాగన్’ కూడా హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది, 2026 జూన్‌లో విడుదల కానుంది. బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ‘KGF’(KGF), ‘సలార్’ (Salaar) లాంటి హిట్స్ ఇచ్చిన నీల్ ఈసారి ఎన్టీఆర్‌తో భారీ యాక్షన్ డ్రామాను తెరపైకి తీసుకొస్తున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ‘డ్రాగన్’ సినిమా ఎన్టీఆర్‌కు మరో బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ‘వార్ 2’తో హిందీ ఆడియన్స్‌ను, ‘డ్రాగన్’తో పాన్ ఇండియా ఫ్యాన్స్‌ను మెప్పించేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ఈ రెండు సినిమాల నుంచి వచ్చే అప్‌డేట్స్ బర్త్‌డే రోజున అభిమానులకు ఫుల్ జోష్ ఇవ్వనున్నాయి.