2023 మొదలై అప్పుడే 3 నెలలు గడిచిపోయింది. అప్పుడే సమ్మర్ సీజన్ మొదలైపోయింది. గత ఏడాది అంటే 2022 ఆరంభమే చాలా బ్యాడ్ గా అనిపించింది. సంక్రాంతికి అనౌన్స్ చేసిన సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో చిన్న సినిమాలతో సంక్రాంతిని ఫినిష్ చేయాల్సి ఉంది.కానీ సమ్మర్ మాత్రం పెద్ద సినిమాలతో వెలిగిపోయింది. ఈసారి మాత్రం రివర్స్.ఈ కోవిడ్ ఫ్రీ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ ‘వాల్తేరు వీరయ్య’ వంటి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి పెద్ద విజయాలు అందుకున్నాయి.
తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ కూడా బాగానే ఆడింది. ‘కళ్యాణం కమనీయం’ అంటూ వచ్చిన చిన్న సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక రిపబ్లిక్ డే కి రిలీజ్ అయిన సుధీర్ బాబు ‘హంట్’ కూడా డిజాస్టర్ గా మిగిలింది. అయితే హిందీ డబ్బింగ్ సినిమా ‘పఠాన్’ మాత్రం మంచి కలెక్షన్స్ ను రాబట్టి.. జనవరి నెలకు శుభం కార్డు వేసింది. ఇక ఫిబ్రవరి ఆరంభంలో వచ్చిన సందీప్ కిషన్ ‘మైఖేల్’ నిరాశపరిచింది.
‘బుట్టబొమ్మ’ అయితే పెద్ద డిజాస్టర్ అయ్యింది. సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్’ అయితే మంచి విజయాన్ని అందుకుంది. అటు తర్వాత వచ్చిన కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ కూడా డిజాస్టర్ అయ్యింది. కానీ ‘సార్’ రూపంలో ఫిబ్రవరి నెలలో ఓ బ్లాక్ బస్టర్ పడింది. ఆ పక్కనే వచ్చిన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ కూడా పర్వాలేదు అనిపించింది. కానీ ‘శ్రీదేవి శోభన్ బాబు’ మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.
మార్చ్ నెల ఆరంభంలో వచ్చిన ‘బలగం’ సినిమా (Movies) పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆది సాయి కుమార్ ‘సి.ఎస్.ఐ సనాథన్’ ఇన్స్టెంట్ డిజాస్టర్ అనిపించుకుంది. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ‘కబ్జ'(డబ్బింగ్) సినిమాలు కూడా పెద్ద డిజాస్టర్లు అయ్యాయి. అయితే మార్చ్ 30న విడుదలైన నాని ‘దసరా’ సినిమా విజయకేతనం ఎగరేసింది. మొత్తంగా 4 బ్లాక్ బస్టర్లు, 3 సూపర్ హిట్లతో 2023 క్వార్టర్లీ ముగిసింది అనుకోవచ్చు.