2025 కి గుడ్ బై చెప్పే టైం వచ్చేసింది. డిసెంబర్ నెలలో థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ- బోయపాటి..ల ‘అఖండ 2′(అఖండ తాండవం) నుండి ‘పతంగ్’ అనే చిన్న సినిమా వరకు పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ఒకసారి డిసెంబర్(2025 December) ప్రాగ్రెస్ ను గమనిస్తే..
డిసెంబర్ నెలలో మొత్తం 40 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో మొదటి వారం(డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సిన ‘అఖండ 2’ ఆర్థిక సమస్యల కారణంగా వారం రోజులు వెనక్కి వెళ్లి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి పర్వాలేదనిపించే టాక్ వచ్చింది.. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయింది. దీని పక్కనే ‘మోగ్లీ’ అనే సినిమా వచ్చింది. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది.

అలాగే ఆది పినిశెట్టి డ్రైవ్ కూడా రిలీజ్ అవ్వగా.. అది వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.’అవతార్ 3′ కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయలేకపోయింది. అటు తర్వాత ఫెయిల్యూర్ బాయ్స్, ఫైటర్ శివ, గుర్రం పాపి రెడ్డి, మేరియో, మిస్ టేరియస్, బ్యాడ్ గర్ల్స్ వంటి సినిమాలు వచ్చి వెళ్లాయి.. అంతే..! ఇక క్రిస్మస్ కానుకగా వచ్చిన ‘ఛాంపియన్’ ‘దండోరా’ ‘ఈషా’ వంటి సినిమాలు పర్వాలేదనిపించగా.. ఆది సాయి కుమార్ ‘శంబాల’ మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
‘పతంగ్’ అనే చిన్న సినిమా కూడా బాగానే అలరించింది. ఇక చివర్లో ‘జల్సా’ ‘మురారి’ వంటి క్లాసిక్స్ రీ రిలీజ్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద కొద్దిగా సందడి చేస్తున్నాయి. ఇలా డిసెంబర్ లో 40 సినిమాల వరకు రిలీజ్ అవ్వగా.. బాక్సాఫీస్ వద్ద 2 హిట్లు, 2 యావరేజ్ సినిమాలతో 2025 కి గుడ్ బై చెప్పినట్టు అయ్యింది.
