ఆడియన్స్ థియేటర్ కి రావడం తగ్గించేశారు… దానికి కారణం ఓటీటీలే అంటూ నిర్మాతలు.. మాట దాటేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సినిమాలు లేకపోవడం వల్లనే.. ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారు అంటూ వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెబుతున్నారు. మరోపక్క ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్ టైంలో థియేటర్లు మూసివేస్తున్నట్టు ప్రచారం కూడా జరిగింది. దాని వెనుక పొలిటికల్ ఇష్యూ కూడా నడిచినట్టు వార్తలు వచ్చాయి.
ఈ క్రమంలో కొంతమంది నిర్మాతలు ప్రెస్ మీట్లు పెట్టి.. ఆ ఇష్యూతో మాకు సంబంధం లేదు అంటే మాకు సంబంధం లేదు అంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెలలో రిలీజ్ కాలేదు. ఇలా జూన్ నెల హైలెట్ అయ్యింది ఈ అంశంతోనే..!
ఇక సినిమాల పరంగా చూసుకుంటే.. జూన్ లో గట్టిగా 15 సినిమాల వరకు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అవి కూడా మిడ్ రేంజ్, డబ్బింగ్, చిన్న సినిమాలు వంటి వాటితో కలిపి..! జూన్ మొదటి వారం నుండి చూసుకుంటే.. కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వచ్చింది. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. తర్వాత ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ వచ్చింది. అది కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. అటు తర్వాత ‘పాప’ ‘హంటర్’ వంటి సినిమాలు వచ్చి వెళ్లినట్టు కూడా చాలా మందికి తెలీదు.
ఇక మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన నాగార్జున-ధనుష్..ల ‘కుబేర’ మంచి విజయాన్ని అందుకుంది. ఆ పక్కనే వచ్చిన ‘8 వసంతాలు’ ని ఆడియన్స్ పట్టించుకోలేదు. ఇక ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ సినిమా బాగున్నా దానికి టికెట్లు తెగలేదు. ఇక జూన్ 27న వచ్చిన ‘కన్నప్ప’ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. పక్కనే వచ్చిన ‘మార్గన్’ ని కూడా ఆడియన్స్ పట్టించుకోలేదు. సో ‘కుబేర’ ‘కన్నప్ప’ తప్ప మిగిలిన ఏ సినిమాలు కూడా నిలబడింది లేదు.