2026 Sankranthi Boxoffice: 2026 సంక్రాంతి బాక్సాఫీస్ @1100 కోట్లు?
- November 29, 2025 / 12:59 PM ISTByPhani Kumar
2025 డిసెంబర్ కి వచ్చేశాం. ఆల్మోస్ట్ ఈ ఏడాదికి గుడ్ బై చెప్పే టైంకి రీచ్ అయిపోయాం. 2026 కి వెల్కమ్ చెప్పే టైం కూడా వచ్చేసింది. సో 2026 అనగానే అందరికీ సంక్రాంతి సినిమాలపైనే దృష్టి పడుతుంది అనడం సందేహం లేదు. 2026 సంక్రాంతి బరిలో దిగే సినిమాల సంఖ్య ఫిక్స్ అయిపోయింది. అవి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాయి? అనే అంశంపై కూడా అందరికీ ఒక ఐడియా వచ్చేసింది.
2026 Sankranthi Boxoffice
ముందుగా జనవరి 9న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన ‘ది రాజాసాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు తర్వాత అంటే జనవరి 10న విజయ్ నటించిన ‘జన నాయకుడు’ రిలీజ్ కానుంది. వీటి తర్వాత అంటే జనవరి 11 న చిరంజీవి- అనిల్ రావిపూడి..ల ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత జనవరి 13న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక చివరిగా అంటే జనవరి 14న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.వీటిలో డౌట్ లేకుండా ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అంటే ‘ది రాజాసాబ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల నుండి రూ.500 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ కూడా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. ఈజీగా రూ.300 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.

వీటి తర్వాత నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) పై కూడా హైప్ గట్టిగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా రూ.100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్సులు ఉన్నాయి. ఇక రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కనుక అటు ఇటు గా రూ.100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ‘జన నాయకుడు’ ‘పరాశక్తి’ సినిమాలు ఆ టైంకి కచ్చితంగా వస్తే.. అవి 2 కలుపుకుని రూ.50 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
సో 2026 సంక్రాంతి బాక్సాఫీస్ మొత్తంగా రూ.1100 కోట్లు టచ్ అయ్యే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.














