ఇంకా ఏడాదికి పైగా టైం ఉంది. కానీ మన మేకర్స్ మాత్రం అప్పుడే 2027 సంక్రాంతి(2027 Sankranthi) స్లాట్స్ కోసం క్యూ కట్టేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే.. షూటింగే మొదలుపెట్టని సినిమాలు కూడా ఈ లిస్టులో హల్చల్ ఉండటం. నెక్స్ట్ సంక్రాంతి కోసం రెడీ అవుతున్న ఆ ప్రాజెక్టులు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

మెగా 158: ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ షేక్ చేసిన చిరంజీవి – బాబీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ నిర్మించబోయే ఈ పాన్ ఇండియా గ్యాంగ్‌స్టర్ డ్రామాను వచ్చే సంక్రాంతికే దించాలని ఫిక్స్ అయ్యారట. అక్టోబర్ కల్లా షూటింగ్ ఫినిష్ చేసే ప్లాన్‌లో టీమ్ ఉంది.
శర్వానంద్- శ్రీను వైట్ల ప్రాజెక్ట్: శ్రీను వైట్ల డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా పండగకే వస్తుందని హీరో శర్వానంద్ రీసెంట్‌గా ఓ పబ్లిక్ ఈవెంట్‌లో ఓపెన్‌గానే చెప్పేశాడు. బడ్జెట్ లిమిట్స్‌లోనే ఉంటుంది కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్ ఇబ్బందులు లేకుండా ఈ సినిమా రేసులో నిలబడే ఛాన్స్ ఉంది.
‘జాంబీ రెడ్డి 2’ :తేజ సజ్జ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేస్తున్న సీక్వెల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌పై ‘పొంగల్ రిలీజ్’ అని స్పష్టంగా వేశారు. కానీ ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో.. ఆ డేట్‌ను అందుకోవడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ప్రచారంలో ఉన్న టైటిల్ జాంబీ రెడ్డి 2.
తలైవర్ 173: రజనీకాంత్ హీరోగా, సిబి చక్రవర్తి డైరెక్షన్‌లో కమల్ హాసన్ నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ (తలైవర్ 173) కూడా సంక్రాంతి రేసులో ఉండాలని గట్టి పట్టుదలతో ఉందట. ఎట్టి పరిస్థితుల్లోనూ పండగ మిస్ కాకూడదని ప్లాన్ చేస్తున్నారు.
వెంకీ – అనిల్ కాంబో మూవీ: బ్లాక్ బస్టర్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి, తన నెక్స్ట్ మూవీ వెంకటేష్‌తోనే ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. విశేషం ఏంటంటే.. ఇందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తారనే రూమర్ బలంగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
బాలయ్య : సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక మీడియం రేంజ్ ఎంటర్టైనర్‌ను బరిలో దింపే యోచనలో ఉంది. మరోవైపు బాలకృష్ణ – గోపీచంద్ మలినేని ప్రాజెక్ట్ గనుక ఆలస్యం అయితే, అది కూడా ఈ సంక్రాంతి రేసులోకి వచ్చేస్తుంది.
ప్రకటనలు, లీకులు అయితే ఘనంగా ఉన్నాయి కానీ.. చివరి వరకు ఎవరు నిలబడతారో, ఎవరు తప్పుకుంటారో క్లారిటీ రావాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.
