యూత్‌లో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) అంటే వేరే లెవెల్‌లో క్రేజ్ ఉంది. ‘లవ్ టుడే’తో తన రేంజ్ ఏంటో చూపించిన ఈ కుర్రాడు.. తాను హీరో మెటీరియల్ కాదన్న నోళ్లనే తన టాలెంట్‌తో మూయించాడు. ఫ్యాన్స్ ముద్దుగా ‘జూనియర్ ధనుష్’ అని పిలుచుకునే ప్రదీప్, ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అయితే ఇప్పుడు చెన్నై సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది.
ప్రదీప్ రంగనాథన్ మళ్లీ మెగాఫోన్ పట్టుకోబోతున్నాడట. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో ఓ డిఫరెంట్ సోషియో ఫాంటసీ కథను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో అసలు కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్లుగా నటించబోతున్నారట.కథలో దమ్ముంటే లాంగ్వేజ్‌తో పనిలేదని ప్రూవ్ చేస్తున్న శ్రీలీల.. ప్రదీప్ క్రేజ్ చూసి ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.

మరోవైపు సరైన బ్రేక్ కోసం చూస్తున్న మీనాక్షి చౌదరికి కూడా ఇది మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ప్రదీప్ మార్క్ టేకింగ్‌లో వీళ్లిద్దరూ నటిస్తే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోవడం ఖాయం.ఇదిలా ఉంటే.. విగ్నేష్ శివన్ డైరెక్షన్ లో ప్రదీప్ నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC) రిలీజ్ ఇంకా వాయిదా పడుతూనే ఉంది. అనిరుధ్ మ్యూజిక్, ఎస్.జె.సూర్య వంటి క్రేజీ కాంబినేషన్ ఉన్నా.. కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల మూవీ లేట్ అవుతోంది.
ఆ సినిమా రిలీజ్ క్లారిటీ వచ్చేలోపే.. ప్రదీప్ తన డైరెక్షన్ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి హీరోగా, డైరెక్టర్ గా ఈ ‘డ్రాగన్’ స్టార్ స్పీడ్ మామూలుగా లేదు.
