‘ఎల్ 2 : ఎంపురాన్’ (L2: Empuraan) సినిమా కాంట్రోవర్సీలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.’లూసిఫర్’ కి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమాలో మత ఘర్షణ అంశం వివాదాస్పదంగా మారింది. 2002 లో గుజరాత్ లో జరిగిన మత ఘర్షణల ఆధారంగా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని.క్యారెక్టర్ల పేర్లు నిజం జీవితంలో ఉన్నవారికి రిలేట్ అవుతున్నాయని ‘రాష్ట్రీయ స్వయం సేవక్’ సంఘం వారు ఆరోపించారు. ఒక సన్నివేశంలో అయితే గర్భిణీ స్త్రీ పై అత్యాచారం చేసినట్లు చూపించారు.
ఇలాంటివి హింసని ప్రేరేపించేలా ఉన్నాయని కూడా వారు అభ్యంతరం తెలిపారు. దీంతో హీరో మోహన్ లాల్ (Mohanlal) క్షమాపణలు చెబుతూ ఓ లేఖను విడుదల చేయడం జరిగింది. మరోపక్క మూవీ యూనిట్ కి చెందిన వారు తమకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి కూడా సీన్లోకి ఎంట్రీ ఇచ్చి తన కొడుకుని సమర్ధించుకున్నారు. మోహన్ లాల్ కి తెలీకుండా పృథ్వీరాజ్ కొన్ని వివాదాస్పద సీన్లు తీసి జోడించారు అంటూ అభిమానులు చేసిన విమర్శలు సైతం ఆమె తిప్పికొట్టారు.
ఇదిలా ఉంటే.. ‘ఎల్ 2 : ఎంపురాన్’ సినిమాకి రీ- సెన్సార్ చేశారట. ఏకంగా 24 సన్నివేశాలు సెన్సార్ వారు కట్ చేయడం జరిగిందట. ఇందులో భాగంగా సెంట్రల్ మినిస్టర్ సురేష్ గోపి పేరును కూడా మ్యూట్ చేసినట్టు వినికిడి. వరల్డ్ వైడ్ గా ఈరోజు నుండి కొత్త వెర్షన్ థియేటర్లలోకి అందుబాటులోకి వచ్చినట్టు సమాచారం. మరి ఇకనైనా ఈ వివాదం సర్దుమణుగుతుందేమో చూడాలి.