నటులు అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాలి.అప్పుడే సంపూర్ణ నటులు అనిపించుకుంటారు. ‘సినిమా వాళ్ళు అంటే గ్లామర్ కే ప్రాముఖ్యత ఇస్తారు’ అని అంతా అనుకుంటారు. అయ్యుండొచ్చు కానీ పాత్రకి తగ్గట్టు ఎలాంటి గెటప్లోకి అయినా మారాలి. అప్పుడే వాళ్లకి ఎక్కువ సినిమాల్లో అవకాశాలు లభిస్తాయి. ఇది పక్కన పెడితే హీరో హీరోయిన్లు అన్నాక గ్లామర్ గానే కనిపించాలి లేదంటే ప్రేక్షకులు ఒప్పుకోరు అనే అభిప్రాయాలు కూడా ఒకప్పుడు ఉండేవి.
తమిళ సినిమా హీరో, హీరోయిన్లు మాత్రమే డీ గ్లామరస్ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపించే వారు అని అంతా అంటుంటారు. కానీ ఇప్పుడు అలా లేదు. హీరో, హీరోయిన్లు ఎంత డీగ్లామరస్ లుక్స్ లోకి మారితే సినిమా సన్నివేశాలు అంత బాగా వస్తాయనే నిర్ణయానికి ప్రేక్షకులు వచ్చేసారు. ఏ కథకైనా ఒక వరల్డ్ అంటూ క్రియేట్ అవ్వాలి. అందులోని పాత్రలు సహజంగా కనబడాలి. అలా అయితేనే సినిమా రిజల్ట్ పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి.
హీరోలైనా (Actors) సరే కథ డిమాండ్ చేస్తే నల్లగా అయినా, పొట్టిగా అయినా అవసరమైతే గుండుతో అయినా కనిపించాలి. గతంలో కొంతమంది హీరోలు ఇలాంటి డీగ్లామరస్ లుక్లో కనిపించారు. కానీ తర్వాత ఇవి రిస్క్ అని భావించి తర్వాత అలాంటి ప్రయత్నాలు మానుకున్నారు. అయితే తాజాగా రిలీజ్ అయిన ‘జవాన్’ ట్రైలర్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. గుండు లుక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో కూడా కొంతమంది నటీనటులు ఇలాంటి ఛాలెంజింగ్ లుక్ లో కనిపించిన నటీనటులు ఎవరో.. అవి ఏ సినిమాలోనో ఓ లుక్కేద్దాం రండి :
1) తమన్నా : ఊసరవెల్లి
2) మోహన్ బాబు : శివ్ శంకర్
3) రజినీకాంత్ : శివాజీ
4) సూర్య : గజినీ
5) విశాల్ : సెల్యూట్
6) షారుఖ్ ఖాన్ : జవాన్
7) అక్షయ్ కుమార్ : హౌస్ ఫుల్ 4
8) రన్ వీర్ సింగ్ : బాజీరావ్ మస్తానీ
9) అమితాబ్ బచ్చన్ : పా
10) సంజయ్ దత్ : అగ్నిపత్
11 ) శిల్పా శెట్టి : ది డిజైర్
12) అమ్రీష్ పురి : జగదేక వీరుడు అతిలోక సుందరి
13) ప్రియాంక చోప్రా : మేరీ కామ్
14) అనుష్క శర్మ : ఏ దిల్ హై ముష్కిల్
15) కళ్యాణ్ రామ్ : ఓం 3D
16) కమల్ హాసన్ : అభయ్
17) షాహిద్ కపూర్ : హైదర్
18) ఆమిర్ ఖాన్ : గజినీ (హిందీ)
19) గోపీచంద్ : నిజం
20) సత్యరాజ్ : బాహుబలి(సిరీస్)
21) కార్తీ : కాష్మోరా
22) అర్జున్ కపూర్ : పానిపట్
23) రాజశేఖర్ : శేషు
24) సాయి కుమార్ : లా అండ్ ఆర్డర్
25) వెంకటేష్ : ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు