సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కిన పుష్ప ది రైజ్ అంచనాలకు మించి సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ పై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రైజ్ 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించగా పుష్ప పార్ట్2 కు ప్రముఖ ఓటీటీ సంస్థ ఏకంగా 400 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఫిబ్రవరి నెల నుంచి పుష్ప ది రూల్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమాలో షాకింగ్ ట్విస్టులు ఉంటాయని బోగట్టా.
దర్శకుడు సుకుమార్ కేశవ పాత్రతో షాకింగ్ ట్విస్ట్ ను ప్లాన్ చేశారని సమాచారం. పుష్ప ది రూల్ ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు 400 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా మేకర్స్ ఆ ఆఫర్ కు నో చెప్పినట్టు బోగట్టా. పుష్ప ది రూల్ రిలీజయ్యే సమయానికి ఏపీలో టికెట్ రేట్లు పెరిగే అవకాశంతో పాటు బాలీవుడ్ లో కూడా పుష్ప ది రూల్ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.
పుష్ప ది రైజ్ హిందీ హక్కులు తక్కువ మొత్తానికే విక్రయించడంతో నిర్మాతలకు ఎక్కువ మొత్తంలో లాభాలు రాలేదని తెలుస్తోంది. అయితే పుష్ప ది రూల్ మాత్రం మంచి లాభాలను అందిస్తుందని పుష్ప మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు సుకుమార్ పుష్ప ది రూల్ లో మెజారిటీ సన్నివేశాలను విదేశాలలో షూట్ చేయనున్నారని సమాచారం.
పుష్ప పార్ట్1 సక్సెస్ తో ఆ సినిమాలో నటించిన నటీనటులకు సైతం బాలీవుడ్ లో క్రేజ్ వచ్చింది. నెగిటివ్ టాక్ తెచ్చుకున్న పుష్ప ది రైజ్ ఫ్యాన్స్ అంచనాలను మించి కలెక్షన్లను సాధించి బన్నీ మార్కెట్ ను మరింత పెంచింది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు పుష్ప ది రైజ్ సక్సెస్ కు కొంతవరకు కారణం కాగా పుష్ప ది రూల్ లో కూడా స్పెషల్ సాంగ్ ఉండే విధంగా సుకుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.