అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) , హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) కాంబినేషన్లో ‘లవ్ స్టోరీ’ (Love Story) వంటి క్లాస్ మూవీ తర్వాత రూపొందుతున్న మాస్ మూవీ ‘తండేల్’ (Thandel). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. ఇది కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన మూవీ. శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామంలో జరిగిన ఓ యదార్థ సంఘటనని ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా..శ్రీకాకుళంలోని శ్రీ ముఖలింగ ఆలయం బాగా ఫేమస్.
Thandel
దీన్ని దక్షిణ కాశీగా చాలా మంది భావిస్తారు.ప్రతి ఏటా ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇక ‘తండేల్’ కథలో భాగంగా ఈ సినిమాలో శివనామ స్మరణ మారుమ్రోగేలా ఓ పాట ఉంటుందని మేకర్స్ చెప్పారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటల్లో ఇది హైలెట్ అవుతుందట. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారట.
నాగ చైతన్య, సాయి పల్లవి..లతో పాటు ఈ పాటలో దాదాపు 1000 మంది డ్యాన్సర్‌లు ఇందులో ఉంటారట. ఇక ఈ పాట గురించి ఇంకో వార్త చర్చనీయాంశం అయ్యింది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ శివపార్వతీ..ల పాట కోసం ఏకంగా రూ.4 కోట్లు ఖర్చు చేశారు అని సమాచారం.సినిమా పబ్లిసిటీకి ఈ పాట బాగా కలిసొస్తుందని చిత్ర బృందం భావిస్తోందట.
అందుకోసమే ముందుగా ఈ పాటను విడుదల చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఒక్క పాట కోసమే ఇంత బడ్జెట్ పెట్టారు అంటే సినిమా కోసం ఎంత బడ్జెట్ అయ్యుంటుంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు. దాదాపు రూ.80 కోట్ల వరకు ఈ సినిమాకి బడ్జెట్ అయ్యిందని ఇన్సైడ్ టాక్.