తెలుగు చిత్రసీమలో నూతనోత్తేజాన్ని నింపింది ఈ నెల (ఆగస్టు) ఆరంభంలో అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ‘జైలర్తో బాక్సాఫీస్ ముందు కాసుల వర్షం కురిపిస్తే.. నెలాఖరున ‘బెదురులంక 2012’, ‘బాయ్స్ హాస్టల్ లాంటి చిన్న చిత్రాలు మెరుపులు మెరిపించాయి. ఇప్పుడే విజయోత్సాహంలోనే ఆగస్టుకు వీడ్కోలు పలుకుతూ సెప్టెంబరు పోరుకు సిద్ధమవుతోంది తెలుగు చిత్ర పరిశ్రమ. ఈ నెలలో దాదాపు అరడజన్ పైగా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ ముందు క్యూ కట్టాయి. మరి వీటిలో హిట్టు మాట వినిపించి.. వసూళ్ల వర్షం కురిపించేవి ఏవి? అన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.
సెప్టెంబరు (September) తొలివారంలో విజయ్ దేవరకొండ – సమంతల ‘ఖుషి’తో పాటు ‘నా..నీ.. ప్రేమకథ’ అనే మరో చిన్న చిత్రం థియేటర్లలోకి రానుంది. అయితే వీటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది ‘ఖుషినే. విజయ్ – సామ్ జంటగా శివ నిర్వాణ రూపొందించిన ఈ ప్రేమ కథా చిత్రం సెప్టెంబరు 1న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
షారుక్ ఖాన్ ‘జవాన్’, నవీన్ పొలిశెట్టి అనుష్కల ‘మిస్ శెట్టి మిస్టర్ పాలిశెట్లు సెప్టెంబరు 7న బాక్సాపీస్ ముందు తలపడనున్నాయి. ‘జవాన్’ పై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు సినీ వర్గాల్లోనూ భారీస్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంపైనా మంచి అంచనాలున్నాయి.
ఈ సారి బాక్సాఫీస్ బరిలో రామ్, విశాల్, లారెన్స్ మధ్య ముక్కోణపు పోటీ కనిపించనుంది. రామ్ ‘స్కంద. ఇది ఈ ఇద్దరికీ తొలి పాన్ ఇండియా ప్రయత్నమే. ఇక లారెన్స్ కంగనా రనౌత్ కలిసి నటించిన ‘చంద్రముఖి 2’, విశాల్ – అధిక్ రవిచంద్రన్ కలయికలో రూపొందిన ‘మార్క్ అంథోని’ చవితి బరిలోనే అదృష్టం పరీక్షించుకోనున్నాయి.
సెప్టెంబరు 15న థియేటర్లలోకి అడుగుపెడుతున్న ఈ మూడు సినిమాల్లో విజయ ఢంకా మోగించేది. ఏదన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఈ మూడింటికి రెండు వారాల లాంగ్ వీకెండ్ దొరకడం.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు కొల్లగొట్టే అవకాశముందని చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండేళ్లుగా సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘సలార్ ఒకటి. ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ఇది. ఇది రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘సలార్ పార్ట్1: సీజ్ ఫైర్ పేరుతో సెప్టెంబరు 28న థియేటర్లలో అడుగుపెట్టనుంది.