‘8 వసంతాలు’ అనే సినిమా జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ‘మధురం’ వంటి కల్ట్ షార్ట్ ఫిలిం అందించిన ఫణీంద్ర నర్సెట్టి డైరెక్ట్ చేసిన సినిమా ఇది.టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన ‘మైత్రి మూవీ మేకర్స్’ ఈ చిత్రాన్ని నిర్మించింది. రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాయి. కానీ మొదటి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. మరోపక్క దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా కొన్ని కాంట్రోవర్సీ అయ్యాయి.
అతని ఆటిట్యూడ్ పై కొంతమంది సెటైర్లు వేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటీనటుల స్పీచ్ లు అయితే ఓవర్ ది టాప్ అనిపించాయి. యాంకర్ సుమ కూడా అర్దాంతరంగా హీరోయిన్ స్పీచ్ ను ఆపేసింది అంటే అర్థం చేసుకోవచ్చు. టీజర్, ట్రైలర్స్ తో ‘8 వసంతాలు’ చూడాలనే ఆసక్తి కొంతమందిలో క్రియేట్ అయినప్పటికీ ఇంతకు ముందు చెప్పుకున్న అంశాలు.. ఆ ఆసక్తిని పోగొట్టాయి అనే చెప్పాలి.
అందువల్ల థియేటర్లలో సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. వీకెండ్ తర్వాత ఆల్మోస్ట్ వాషౌట్ అయిపోయింది. కానీ జూలై 11న ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో రిలీజ్ అయ్యింది. ఓటీటీ రెస్పాన్స్ మాత్రం పాజిటివ్ గా ఉంది. క్రమక్రమంగా ఆదరణ పెరుగుతూనే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూస్తున్నారు. మంచి పాటలు ఉన్నాయని పొగుడుతున్నారు. ఈ వీకెండ్ కి దీని వ్యూయర్ షిప్ మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదు.
నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 30 రోజులు కావస్తోంది. హైదరాబాద్, కె.పి.హెచ్.బి లో ఉన్న నెక్సస్ మాల్ లో రోజుకో షో చొప్పున ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. 30 రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో రేపు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఈ సినిమాని ప్రేక్షకులతో కలిసి వీక్షించబోతున్నారట. అయితే కొంతమంది ’30 రోజుల్లోనే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అవుతుంది’ అంటూ కామెంట్స్ పెడుతుండటం గమనార్హం.