టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమాలో అయినా నటించాలనే కోరిక అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబుతో జక్కన్న ఒక సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అయితే అజిత్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో జక్కన్న భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ బాబుతో సినిమా పూర్తైన వెంటనే అజిత్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో జక్కన్న భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారని త్వరలో ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
అయితే అజిత్ బన్నీ కాంబో గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. 2015 సంవత్సరం నుంచి ఈ వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. రాజమౌళి వైపు నుంచి క్లారిటీ వస్తే మాత్రమే ఈ సినిమాకు సంబంధించిన సందేహాలకు చెక్ పడే అవకాశం ఉంది. బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉండగా అజిత్ (Ajith) కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటం గమనార్హం.
ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పవచ్చు. బన్నీ సైతం జక్కన్న డైరెక్షన్ లో నటించడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. రాజమౌళి రాబోయే రోజుల్లో తన సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరించనున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి ప్రస్తుతం 100 కోట్ల రూపాయల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటున్నారు. రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో రాజమౌళి తన సినిమాలను తెరకెక్కిస్తుండటం గమనార్హం. రాజమౌళికి ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. రాజమౌళి భవిష్యత్తు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రేంజ్ మరింత పెంచాలని అభిమానులు భావిస్తున్నారు.