తమన్నా(Tamannaah Bhatia) చిక్కుల్లో పడింది. విషయంలోకి వెళితే.. హీరోయిన్ గానే కాకుండా పలు యాడ్స్ లో నటిస్తూ అలాగే పలు యాప్స్ ను కూడా ఈమె ప్రమోట్ చేస్తుంది అలా తమన్నా చేసిన ఓ యాడ్ వల్ల చిక్కుల్లో చిక్కుకుంది. మరికొన్ని డీటెయిల్స్ లోకి వెళితే.. ఐపీఎల్ సీజన్ కాబట్టి చాలా మంది ప్రేక్షకులు సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లకుండా బుల్లితెరపై స్టార్ మ్యాచ్ లు చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు అధికారికంగా కేవలం..
జియో, వియాకామ్ 18 అనుబంధ ‘జియో’ యాప్ లో మాత్రమే చూసే అవకాశం ఉంది. కానీ టెక్నాలజీని వాడి అనధికారికంగా కూడా స్ట్రీమ్ చేస్తున్న మాధ్యమాలు ఉన్నాయి. ఈ లిస్ట్ లో బెట్టింగ్ యాప్ ఫెయిర్ ప్లే అనే యాప్ కూడా ఉంది. అయితే తమన్నా ఈ యాప్ లో కూడా ఐపీఎల్ మ్యాచ్ లు చూడొచ్చు అంటూ ప్రమోట్ చేసింది. దీంతో ‘వియాకామ్ 18 ‘ సంస్థ మహారాష్ట్ర కోర్టుకెక్కింది.ఇందులో భాగంగా తమన్నా..
పై సైబర్ క్రైమ్ కేసు నమోదవ్వడం కూడా జరిగింది.ఈ కేసు నిమిత్తం ఆమె ఏప్రిల్ 29 లోపు వివరణ ఇవ్వాలి అంటూ నోటీసులు పంపడం కూడా జరిగింది. ఈ రకంగా తమన్నా చిక్కుల్లో పడినట్టు అయ్యింది. మరి ఈ ఇష్యు పై తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన కన్నడ చిత్రం ‘బాక్’ లో రిలీజ్ కాబోతోంది.