టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ప్రభాస్ చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా ఎన్నో అరుదైన రికార్డులు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి2, సాహో, ఆదిపురుష్ సినిమాలు 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం గ్రాస్ కలెక్షన్లను సాధించాయి. సౌత్ ఇండియాలో 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు సాధించిన నాలుగు సినిమాలు కేవలం ప్రభాస్ ఖాతాలోనే ఉన్నాయి.
స్టార్ హీరో ప్రభాస్ కు మాత్రమే ఈ అరుదైన ఘనత సొంతమని చెప్పవచ్చు. అయితే తన సినిమాలు ఈ రేంజ్ లో రికార్డులు సాధిస్తున్నా ప్రభాస్ మాత్రం ఆ రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోరు. తనపై ఏవైనా నెగిటివ్ కామెంట్లు వచ్చినా ప్రభాస్ స్పందించరు. తన సినిమాల ద్వారానే ప్రభాస్ విమర్శలకు జవాబులు చెబుతారు. సలార్ సినిమాతో మరికొన్ని భారీ రికార్డులు ప్రభాస్ ఖాతాలో చేరే ఛాన్స్ అయితే ఉంది.
సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ డైరెక్టర్ కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. బాహుబలి2 సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వని ప్రభాస్ సలార్ సినిమా నుంచి వరుసగా భారీ బ్లాక్ బస్టర్లు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా కెరీర్ విషయంలో ప్రభాస్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
ప్రభాస్ (Prabhas) రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉన్నా ప్రభాస్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్ లు ప్రభాస్ రేంజ్ ను పెంచడం ఖాయమని ప్రభాస్ రాజమౌళి కాంబోలో మరికొన్ని సినిమాలు రావాలని అభిమానులు భావిస్తున్నారు. ఇతర భాషల్లో సైతం ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.