పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో కెరీర్ పరంగా త్వరలో బిజీ కానున్నారు. పవన్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు కూడా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు 2024 ఎన్నికల్లో పవన్ ఎక్కడినుంచి పోటీ చేస్తారనే చర్చ సైతం జోరుగా జరుగుతోంది. పవన్ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడంతో పాటు జనసేన పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు వస్తాయని పవన్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ సైతం హాజరయ్యారు. అయితే సరిగ్గా మూడేళ్ల క్రితం జనవరి 22వ తేదీన పవన్ కళ్యాణ్ అయోధ్యకు వెళ్లి 30 లక్షల రూపాయల విరాళం ప్రకటించడం జరిగింది. పవన్ కళ్యాణ్ విరాళం ఇచ్చిన మూడేళ్ల తర్వాత అదే తేదీన ప్రాణప్రతిష్ట జరిగిందని పవన్ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ 600 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.
పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో నటిస్తున్న పవన్ తన సినిమాలతో ఇతర భాషల్లో సైతం విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎన్నికలు పూర్తైన తర్వాత పవన్ ఇప్పటికే ప్రకటించిన సినిమాలన్నీ కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
పవన్ (Pawan Kalyan) 2019 తర్వాత నటించిన సినిమాలన్నీ కమర్షియల్ గా సేఫ్ అయ్యాయి. పవన్ రాబోయే రోజుల్లో ఎంచుకునే కథలు కూడా వైవిధ్యంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని భోగట్టా. పవన్ తర్వాత సినిమాలు కలెక్షన్ల విషయంలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాయో చూడాలి.