నందమూరి హీరోలుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సోదరులు ఒకరు. వీరిద్దరూ అన్నదమ్ములుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఇక తమ్ముడికి కోసం కళ్యాణ్ రామ్ నందమూరి కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారు. ఇక అన్నయ్య సినిమాలకు చేయాల్సిన సపోర్ట్ ఎన్టీఆర్ కూడా చేస్తూ తన అన్నయ్య సినిమాలను సక్సెస్ చేస్తున్నారు. ఇలా ఎంతోమంది అన్నదమ్ములకు ఆదర్శంగా ఉన్నటువంటి వీరిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి
ఇలా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలన్నింటికీ కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తారు. గతంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ బింబిసారా, అమిగోస్ వంటి సినిమాల ప్రీ రిలీజ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. అయితే కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన డెవిల్ సినిమా ఈనెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలోనే ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను జరుపుకున్నారు అయితే వేడుకకు ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ ఈ సినిమా వేడుకకు రాకపోవడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని అందుకే తన అన్నయ్యను కూడా ఎన్టీఆర్ దూరం పెడుతున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా వేడుకకు ఎన్టీఆర్ దూరంగా ఉండటానికి కారణం లేకపోలేదు.
ప్రతి ఏడాది ఎన్టీఆర్ (Jr NTR) తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా అనుకోకుండా వీరు వెకేషన్ వెళ్లడంతో తన అన్నయ్య సినిమా వేడుకకు రాలేదని తెలుస్తోంది. అంతకుమించి వీరి మధ్య మనస్పర్ధలు లేవని అభిమానులు విషయంపై కామెంట్లు చేస్తున్నారు.