రామ్ చరణ్ (Ram Charan) శంకర్ (Shankar) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ (Game Changer) సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా మరికొన్ని గంటల్లో చరణ్ పుట్టినరోజు కానుకగా జరగండి సాంగ్ రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. థమన్ (S.S.Thaman) ఈ సినిమాకు మ్యూజిక్ అందించగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా మూడు భాషల్లో మాత్రమే రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. జరగండి సాంగ్ ను కేవలం మూడు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో సైతం ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. అయితే కన్నడ, మలయాళం భాషల్లో మాత్రం ఈ సినిమా రిలీజ్ కావడం లేదని తెలుస్తోంది. ఆ భాషల ప్రేక్షకులు గేమ్ ఛేంజర్ సినిమాను చూడాలని అనుకుంటే తెలుగు లేదా తమిళ్, హిందీ వెర్షన్లలో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ ను మూడు భాషల్లో రిలీజ్ చేయడం వెనుక దిల్ రాజు (Dil Raju) ప్లాన్ ఏంటో తెలియాల్సి ఉంది.
గేమ్ ఛేంజర్ సినిమా బిజినెస్ పరంగా కూడా నిర్మాతలకు విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్స్ అందిస్తోందని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాత దిల్ రాజు సరైన రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. వినాయక చవితి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని శంకర్ పేరు ఈ సినిమాతో మరోసారి మారుమ్రోగడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చరణ్, శంకర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.