నటి మోజులో దర్శకుడు… పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితుడు..!

చిత్ర పరిశ్రమలో ఉన్న చీకటి కోణాల్లో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ‘మీటూ’ టైంలో దీని గురించి ఇండియా మొత్తం మాట్లాడుకుంది. కొత్తగా అవకాశాలు కోసం వచ్చే హీరోయిన్లను లేదా జూనియర్ ఆర్టిస్ట్ లను.. కొంతమంది లైంగికంగా వేధిస్తూ ఉంటారని కొందరు నటీమణులు మీడియా లేదా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘మీటూ’ వల్ల సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది తగ్గింది అని అంతా అనుకుంటున్నారు.

కానీ దాని ప్రభావం తాత్కాలికంగానే ఉందని.. స్పష్టమవుతుంది. విషయం ఏంటి అంటే ఓ దర్శకుడు హీరోయిన్ మోజులో పడి సినిమాటోగ్రాఫర్ ను ఏడిపిస్తున్నాడు. అంతేకాదు అతని భార్యను మానభంగం చేసి హతమారుస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. వివరాల్లోకి వెళితే.. “తమిళనాడులో ఉన్న రామాపురం పోలీసుల కథనం ప్రకారం.. భారతీ వీధికి చెందిన ఎం ఎస్ ప్రభు… 30 ఏళ్లుగా సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నాడు.

2006లో ఇతనికి ఏ ఎల్ సూర్య అనే దర్శకుడితో పరిచయమైంది. ఈ క్రమంలో నటి పద్మప్రియ కు సంబంధించిన ఓ వీడియో విషయంలో వీరిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది. దీంతో పద్మప్రియను తనకు పరిచయం చేయాల్సిందిగా ఎం ఎస్ ప్రభుని అడిగాడట దర్శకుడు సూర్య. కానీ ప్రభు ఏమి స్పందించకపోవడంతో.. దర్శకుడు సూర్య తెగించి..

ఏకంగా పద్మప్రియ నెంబర్ కావాలని ఒత్తిడి చేస్తున్నాడట.ఈ క్రమంలో పద్మప్రియ నెంబర్ కనుక ఇవ్వకపోతే నీ భార్యను మానభంగం చేస్తానని ప్రభును బ్లాక్ మెయిల్ చేశాడట సూర్య. దీంతో ప్రభు రామాపురం పోలీసులను ఆశ్రయించి దర్శకుడు సూర్య పై కేసు పెట్టాడు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus