టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ఈరోజు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు పెరుగుతున్నా ఆయన లుక్స్ ను చూసిన వాళ్లు మాత్రం మహేష్ బాబు వయస్సును అస్సలు నమ్మలేరనే సంగతి తెలిసిందే. అయితే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు రీమేక్ సినిమాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.
తన సినిమాలతో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్న మహేష్ 1975 సంవత్సరంలో మద్రాస్ లో జన్మించారు. నీడ సినిమాతో బాల నటుడిగా మహేష్ ప్రయాణం మొదలుకాగా ఆరేళ్ల వయస్సులోనే మహేష్ తొలి సినిమాలో నటించడం గమనార్హం. ఆ తర్వాత కృష్ణతో కలిసి పోరాటం సినిమాలో మహేష్ నటించారు. చిన్న వయస్సులోనే ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించడంతో మహేష్ బాబు సరిగ్గా స్కూల్ కు వెళ్లేవాడు కాదు.
పదో తరగతిలో (Mahesh Babu) మహేష్ కు ఆశించిన స్థాయిలో మార్కులు రాకపోవడంతో లయోలా కాలేజ్ లో ఇంటర్ చదివేందుకు మహేష్ కు ఛాన్స్ దక్కలేదు. ఈ కాలేజ్ మహేష్ కు ఇష్టమైన కాలేజ్ కాగా ఈ కాలేజ్ లో ఇంటర్ చదివే అవకాశం కోల్పోవడంతో మహేష్ బాబు తెగ ఫీలయ్యారు. అయితే ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన మహేష్ లయోలా కాలేజ్ లో బీకామ్ సీటు సాధించారు.
రాజకుమారుడు సినిమాతో హీరోగా మహేష్ ప్రయాణం మొదలు కాగా బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా మహేష్ ఆ ఆఫర్లకు నో చెప్పారు. మహేష్ ఏకంగా 8 నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబును ఇతర స్టార్ హీరోల అభిమానులు సైతం అభిమానిస్తారు.