‘కొన్ని సినిమాలు బ్లాక్ మనీని వైట్ గా చేసుకోవడానికే తీస్తారేమో’ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. చాలా కాలంగా ఉంది. కానీ పోయి పోయి ఓ ప్లాప్ సినిమా కోసం మేకర్స్ తమ కెరీర్ ని పణంగా ఎందుకు పెడతారు అనే కాంట్రాడిక్షన్ ఆన్సర్ కూడా ఉంది. అందువల్ల దీనిని జనాలు పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. పైగా ప్రమోషన్ కోసం కోట్లకు కోట్లు పెట్టామని చెప్పుకుని.. ఐటీ రైడ్స్ కూడా ఫేస్ చేసే నిర్మాతలపై జాలి పడ్డారు కూడా..! అయితే సినీ పరిశ్రమలో బ్లాక్ మనీని వైట్ గా చేస్తారు అనేది నిజం అని 2 సినిమాలతో ప్రూవ్ అయ్యింది.
అది కూడా పేరున్న హీరోలతో చేసిన సినిమాలతోనే.. వివరాల్లోకి వెళితే… 2022 లో ‘మళ్ళీ మొదలైంది’ అనే సినిమా వచ్చింది. సుమంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీలో రిలీజ్ అయ్యింది. దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. ఓటీటీ కాబట్టి… ఈ రిజల్ట్ వల్ల నిర్మాతకి కానీ సుమంత్ కి కానీ జరిగిన డామేజ్ ఏమీ లేదనే చెప్పాలి.
‘రెడ్ సినిమాస్’ బ్యానర్ పై కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ అని బ్యానర్ పేరు మార్చి నిఖిల్ తో ‘స్పై’ అనే సినిమా చేశారు. ఇది కూడా ప్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమాల కోసం రాజశేఖర్ రెడ్డి రూ.12 కోట్లు బ్యాంకుల నుండి అప్పు తీసుకున్నారట. కానీ వీటి మేకింగ్ కోసం రూ.40 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.
మిగిలిన రూ.28 కోట్లు క్యాష్ రూపంలో ఖర్చుపెట్టినట్లు టాక్ నడుస్తుంది. మరోపక్క ఓటీటీ రైట్స్ రూపంలో వీటికి రూ.36 కోట్లు రికవరీ జరిగిందట. ఇలా బ్లాక్ ను వైట్ చేసుకున్నట్టు చర్చ నడుస్తోంది. తర్వాత ఇదే బ్యానర్లో మిడ్ రేంజ్ సినిమాలు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు వాటిని పక్కన పెట్టినట్లు టాక్ నడుస్తుంది.