దిల్ రాజు- నితిన్ కాంబినేషన్లో రూపొందిన ‘తమ్ముడు’ సినిమా ఇటీవల(జూలై 4న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా దారుణంగా ప్లాప్ అయ్యింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో ఫామ్లోకి వచ్చిన దిల్ రాజు… ‘తమ్ముడు’ తో నితిన్ కి హిట్ ఇస్తారేమో అని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ‘తమ్ముడు’ తర్వాత నితిన్ తో మరో సినిమా నిర్మిస్తున్నారు దిల్ రాజు. ‘యల్లమ్మ’ అనే టైటిల్‌తో రూపొందనున్న సినిమా ఇది. తెలంగాణ నేటివిటీ నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథా చిత్రం ఇది.
‘బలగం’ వేణు దర్శకుడు. దీనికి కూడా ‘తమ్ముడు’ మాదిరి భారీ బడ్జెట్ పెట్టాలి. దీంతో ‘ఎల్లమ్మ’ నితిన్ తో ఉంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. హీరో, హీరోయిన్స్ లేని పార్ట్ షూటింగ్ కూడా కొంత జరిగింది. సో వెనకడుగు వేయడానికి స్కోప్ లేదు.
అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విషయంలో కూడా దర్శకుడు వేణు, హీరో నితిన్ ..లకి ఎటువంటి పారితోషికాలు ఇవ్వడం లేదట.నితిన్ కూడా ఇప్పుడు పారితోషికం డిమాండ్ చేసే పొజిషన్లో లేడు. అతనికి ఇప్పుడు అర్జెంటుగా ఒక హిట్టు కావాలి. లేదంటే మార్కెట్ మరింత డౌన్ అవుతుంది. అందుకే ‘ఎల్లమ్మ’ సినిమాకి ఎటువంటి పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకోవడానికి రెడీ అయ్యాడట.
దిల్ రాజు ఈ ప్రపోజల్ పెట్టగా అందుకు నితిన్ అంగీకారం తెలిపినట్టు స్పష్టమవుతుంది. ‘తమ్ముడు’ విషయంలో కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు దిల్ రాజు. ఈ 2 సినిమాలకి గాను నితిన్ కి అడ్వాన్స్ ఇచ్చారు. కానీ పారితోషికం పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. బలగం వేణు విషయంలో కూడా ఇంతే. సినిమా హిట్ అయితే అతను లాభాల్లో వాటా అందుకుంటాడు.