‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ వంటి వరుస పరాజయాలతో రేసులో వెనక్కి పడ్డ శర్వానంద్ ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనే ఆశతో ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాన్ని చేశాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శర్వానంద్ కు జోడీగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించగా…. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మార్చి 4న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది… కానీ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకోలేకపోయింది.అయితే మొదటి సోమవారం నాడు భారీగా అయితే డ్రాప్ అవ్వలేదు. ఒకసారి 4డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం
2.22 cr
సీడెడ్
0.64 cr
ఉత్తరాంధ్ర
0.68 cr
ఈస్ట్
0.40 cr
వెస్ట్
0.31 cr
గుంటూరు
0.38 cr
కృష్ణా
0.38 cr
నెల్లూరు
0.23 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
5.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.33 cr
ఓవర్సీస్
0.84 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
6.41 cr
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.6.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.10.09 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ కొంత డీసెంట్ అనిపించినప్పటికీ.. సోమవారం కూడా పర్వాలేదు అనిపించినప్పటికీ .. ఈ వారమంతా ఇదే విధంగా రాబట్టి..
సెకండ్ వీకెండ్ గ్రోత్ చూపిస్తే చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది.కానీ ఓ పక్క ‘భీమ్లా నాయక్’ మరోపక్క.. ఈ శుక్రవారం నుండీ ‘రాధే శ్యామ్’ ఎంట్రీ ఇస్తుంది కాబట్టి.. టార్గెట్ రీచ్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు.