‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ వంటి వరుస పరాజయాలతో రేసులో వెనుక పడ్డ శర్వానంద్ ఈసారి ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ అంటూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శర్వానంద్ కు జోడీగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న నటించగా…. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మార్చి 4న ఈ చిత్రం విడుదలైన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ లభించింది… కానీ ఓపెనింగ్స్ పరంగా శర్వానంద్ బ్యాడ్ ఫామ్ ను కంటిన్యూ చేస్తుందనే చెప్పాలి.మరీ తీసిపారేశాలా అయితే కాదు కానీ.. ‘ఆడవాళ్ళు’ కలెక్షన్లలో గ్రోత్ కనిపించడం లేదు.
ఒకసారి 6 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
2.48 cr
సీడెడ్
0.73 cr
ఉత్తరాంధ్ర
0.81 cr
ఈస్ట్
0.47 cr
వెస్ట్
0.36 cr
గుంటూరు
0.45 cr
కృష్ణా
0.44 cr
నెల్లూరు
0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
6.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.35 cr
ఓవర్సీస్
0.87 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
7.23 cr
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ.16.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.7.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ.8.77 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ కొంత డీసెంట్ అనిపించినప్పటికీ.. ఇప్పటికీ ఓ మోస్తరుగా రాణిస్తున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ కు ఈ మాత్రం సరిపోవనే చెప్పాలి.