Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

  • May 21, 2025 / 01:11 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అద్భుతమైన కథతో రాబోతోన్న ‘షష్టి పూర్తి’ టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది – హీరోయిన్ ఆకాంక్ష సింగ్

డా. రాజేంద్ర ప్రసాద్, అర్చన కాంబినేషన్ లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ( MAA AAIE ) ప్రొడక్షన్స్ పతాకం పై రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి. ‘మళ్లీ రావా’, ‘దేవదాస్’, ‘పరంపర’ ప్రాజెక్ట్‌లతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్ ఇప్పుడు ‘షష్టి పూర్తి’ అంటూ రాబోతోన్నారు.ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మీడియాతో ముచ్చటించారు. ఆమె సినిమా గురించి చెప్పిన విశేషాలివే..

* తెలుగులో నేను చాలా గ్యాప్ తరువాత వస్తున్నాను. కరోనా వల్ల నాకు చాలా గ్యాప్ వచ్చింది. హీరో నాని సోదరి దీప్తి గంటా తెరకెక్కించిన ‘మీట్ క్యూట్’ చిత్రాన్ని ముందుగా థియేటర్లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ చివరకు ఓటీటీలో వచ్చింది. ఇక ఇప్పుడు ‘షష్టి పూర్తి’ సినిమా థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఇళయరాజా గారి సంగీతం అందరినీ మెప్పిస్తుంది.

* ‘షష్టి పూర్తి’ సినిమాలో జానకి అనే పాత్రలో కనిపిస్తాను. కథను వినేందుకు హైదరాబాద్‌కు వచ్చాను. కథ విన్న వెంటనే, నా పాత్ర గురించి తెలిసిన వెంటనే ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇలాంటి కథలు అవసరం. ఓ గ్రామీణ అమ్మాయి పాత్రను పోషించాను. టెంపుల్ ట్రెజరర్‌గా కనిపిస్తాను. అచ్చమైన తెలుగమ్మాయిగా ఈ చిత్రంలో కనిపిస్తాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 War2 Teaser: యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • 2 Vishal, Sai Dhanshika Marriage: రూమర్స్‌ నిజం.. విశాల్‌ – ధన్సిక పెళ్లి ఖరారు.. ఆ భవనం అయ్యాకే పెళ్లి!
  • 3 Rashi Khanna: షూటింగ్లో గాయపడ్డ రాశీ ఖన్నా..ఫోటోలు వైరల్ !

* ఇంత వరకు నేను అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించే పాత్రను పోషించలేదు. లంగావోణిలు కట్టలేదు. రాజమండ్రిలో నెల రోజులకు పైగా షూటింగ్ చేశాను. గోదావరి ప్రాంతాల్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఎండల్లో అక్కడ ఎంతో కష్టపడి షూటింగ్ చేశాం. పడవల్లో ప్రయాణం చేశాం. అవన్నీ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గోదావరి అందాల్ని మరింత అందంగా చూపించారు.

* ‘బెంచ్ లైఫ్’లో ఇది వరకు నేను రాజేంద్ర ప్రసాద్ గారితో నటించాను. మళ్లీ ఈ చిత్రంలో నటించాను. ఆయనతో కలిసి పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. మేం ఇద్దరం ఎప్పుడు కలిసి నటించినా గ్లిజరిన్ వాడలేదు. సహజంగానే ఎమోషనల్ సీన్స్‌ను రక్తి కట్టించేవాళ్లం. ‘షష్టి పూర్తి’ కోసం పని చేస్తుంటే నాకు యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లినట్టుగా అనిపించింది. ఈ చిత్రంతో ఎంతో నేర్చుకున్నాను.

* ‘షష్టి పూర్తి’ అనేది కేవలం షష్టి పూర్తి గురించే ఉండదు. అన్ని రకాల అంశాలు ఉంటాయి. ఇక ఇందులో నేను కేవలం రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కనిపించను. నా కారెక్టర్‌లో ఎన్నో షేడ్స్ ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడే చెప్పలేను. అవన్నీ మీరు సినిమాలోనే చూడాలి.

* మా నిర్మాత రూపేష్ చాలా మంచి వ్యక్తి. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ చిత్రానికి న్యాయం చేశారు. అందరినీ ఒకతాటిపైకి తీసుకు వచ్చారు. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించారు. మా దర్శకుడు పవన్‌కు ఓ క్లారిటీ, విజన్ ఉంది. కథ మీద ఆయనకు చాలా పట్టు ఉంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

* నన్ను ఓ మంచి నటిగానే జనాలు గుర్తు పెట్టుకోవాలని అనుకున్నాను. అందుకే తగ్గట్టుగానే మంచి పాత్రలను, మంచి కథల్ని ఎంచుకుంటూ వచ్చాను. ‘షష్టి పూర్తి’తో నాకు ఇంకా చాలా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను. నాకు కథ, పాత్ర నచ్చితే ఓటీటీలో అయినా, వెబ్ సిరీస్‌లో అయినా సరే నటిస్తాను. మన పని మనం సక్రమంగా చేసుకుంటూ పోతే అవకాశాలు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయి.

* నాకు అన్ని రకాల పాత్రలను, జానర్లను టచ్ చేయాలని ఉంది. నాకు యాక్షన్ చిత్రాలంటే ఎక్కువగా ఇష్టం. ప్రస్తుతం ఓ యాక్షన్ మూవీని చేస్తున్నాను. అది చాలా బాగా వస్తోంది. తమిళంలో ఇంకో సినిమాను చూస్తాను. నాకు నాని చిత్రాలు అంటే చాలా ఇష్టం. రీసెంట్‌గా ‘అమరన్’ సినిమాను చూశాను.

* ‘షష్టి పూర్తి’ పాటలు, మ్యూజిక్ అందరినీ కదిలిస్తుంది. ప్రతీ పాటకు ఓ ఎమోషన్ ఉంటుంది. ఇళయరాజా గారి పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలి. అందరూ చూడాల్సిన చిత్రం. తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే ఈ సినిమాను అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేయండి. ఈ మూవీ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి నాకు గుర్తుకు వచ్చారు. నేను ఆయన్ను చాలా మిస్ అయ్యాను. తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి.. వారిని ప్రేమించండి. అందరూ ‘షష్టి పూర్తి’ సినిమాను చూడండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aakanksha Singh
  • #Shashtipoorthi

Also Read

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

Kamakshi Bhaskarla: ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు.. హర్రర్ సినిమాలేనా?

related news

Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

Rajamouli: మళ్లీ రాజమౌళి రిలీజ్ కు ముందే కథ చెప్పేయనున్నాడా?

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

trending news

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

15 mins ago
Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

29 mins ago
Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: “గర్ల్ ఫ్రెండ్” సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ!

34 mins ago
Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

2 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

Bhagyashri Borse: భాగ్యశ్రీకి నవంబర్ చాలా కీలకం… హిట్టిచ్చేదెవరు?

2 hours ago

latest news

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

Eeshwar: ‘ఈశ్వర్’ సినిమా హిట్టా? వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో ఆడిందో తెలుసా?

14 hours ago
SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

SSMB29: రేపే హీరోయిన్ ఫస్ట్ లుక్..!

15 hours ago
Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

Jatadhara Collections: 50 శాతం రికవరీ సాధించిన ‘జటాధర’

17 hours ago
The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

The Girl Friend Collections: ‘ది గర్ల్ ఫ్రెండ్’ అక్కడ లాభాల బాట పట్టింది

18 hours ago
Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version