బలగం’ వంటి సినిమాతో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ . ఇప్పుడీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’ . కొరియోగ్రాఫర్ యష్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుండగా.. ‘కామ్రేడ్ ఇన్ అమెరికా’ ఫేమ్.. మలయాళ నటి కార్తీక మురళీధరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో శశి కుమార్ ముతులూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇదొక మ్యూజికల్ డాన్స్ బేస్డ్ లవ్ స్టోరి.
రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘ఉన్నానో లేనో..’ అనే బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు. పాట అందరినీ ఆకట్టుకుంటోంది.
ఉన్నానో లేనో.. నేను నా లోపల
ఉండేలా లేనే.. చూడగా నిన్నిలా..
ఊహల్లో ఊగినానే ఊయల ఆఆఆ..
ఊరించాలా నను ఊరికే ఇంతలా..
అవి చూపులా.. మత్తెక్కించే సూదులా నిలువెల్ల..
తనువుకి తగిలెను.. తనువుకి తగిలెను బాణంలా..
మనసును కోసి.. నా అంతం చూడాలా..
మిల మిల లాడే ఇంతందం నీకేలా.. ’’ అంటూ సాగిన ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ తన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. భరద్వాజ్ పాత్రుడు ఈ పాటకు సాహిత్యం అందించారు.
పాట మనసుని ఆహ్లాదంగా తాకే చిరుగాలిలా ఉంది. హీరోయిన్‌ని చూసిన హీరో తొలి చూపులోనే ప్రేమిస్తాడు. పార్టీలో ఆమెకు తనని తాను పరిచయం చేసుకుంటాడు. హీరో హీరోయిన్ల మధ్య కనిపిస్తోన్న బ్యూటీఫుల్ కెమిస్ట్రీ.. మ్యాజికల్ సాంగ్‌కి తగినట్లు వారిద్దరూ డాన్స్ చేసే తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. సాంగ్ చూస్తున్న అందరినీ ఫిదా చేసేలా పిక్చరైజ్ చేశారు. కచ్చితంగా ఈ సాంగ్ అన్ని ప్లే లిస్ట్‌లలో టాప్‌లో ఉంటుందనటంలో సందేహం లేదు. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి , హన్షితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.