Aamir Khan, Vamshi Paidipally: మరో సౌత్ డైరెక్టర్ తో ఆమిర్ ఖాన్ మూవీ ఫిక్స్…!
- October 8, 2024 / 09:28 PM ISTByFilmy Focus
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. దీంతో టాలీవుడ్లో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. నార్త్ లో కూడా తెలుగు సినిమాల డామినేషన్ రోజు రోజుకీ ఎక్కువవుతుంది. థియేటర్లలో మాత్రమే కాదు యూట్యూబ్, టీవీ వంటి మాధ్యమాల్లో కూడా సౌత్ సినిమాలనే అక్కడి జనాలు ఎక్కువగా వీక్షిస్తున్నారు. దీంతో సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి అక్కడి స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్రెడీ అట్లీతో (Atlee Kumar) షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) .. ‘జవాన్’ (Jawan) అనే సినిమా తీశాడు.అది బ్లాక్ బస్టర్ అయ్యింది.
Aamir Khan, Vamshi Paidipally

దీంతో నార్త్..లోని మిగిలిన స్టార్ హీరోలు కూడా సౌత్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తో (Aamir Khan) .. టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టుని దిల్ రాజు (Dil Raju) నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి చెప్పిన కథ ఆమిర్ ఖాన్ కి నచ్చిందట.
దీంతో వెంటనే ఓకే చెప్పేసినట్టు తెలుస్తుంది. ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థ తో పాటు ఆమిర్ ఖాన్ కూడా ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఆమిర్ ఖాన్… రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) , మురుగదాస్ (A.R. Murugadoss) వంటి సౌత్ డైరెక్టర్లతో ‘రంగేళి’ ‘గజినీ’ వంటి సినిమాలు చేశాడు. అవి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు మరో సౌత్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ (Aamir Khan) సినిమా చేస్తే.. ఈ రకంగా హ్యాట్రిక్ సాధించే అవకాశాలు ఉన్నాయి.














