Janaka Aithe Ganaka First Review: సుహాస్ ‘జనక అయితే గనక’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
- October 7, 2024 / 09:26 PM ISTByFilmy Focus
సుహాస్ (Suhas) సినిమాలకి మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. ఈ ఏడాది ఇప్పటికే ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. మరో 5 రోజుల్లో ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సుహాస్. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ బాగా ఇంప్రెస్ చేశాయి. వాస్తవానికి గత నెల అంటే సెప్టెంబర్ 7నే విడుదల కావాల్సి వుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో వరదలు రావడంతో రిలీజ్ వాయిదా వేశారు.
Janaka Aithe Ganaka First Review

సందీప్ రెడ్డి బండ్ల ఈ చిత్రానికి దర్శకుడు. అక్టోబర్ 12 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ విజయవాడ వంటి కొన్ని చోట్ల ప్రీమియర్స్ వేశారు. సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. వాషింగ్ మెషిన్ సేల్స్ మెన్ గా పనిచేసే ఓ కుర్రాడు.. చాలీచాలని జీతం కారణంగా పిల్లలు వద్దు అనుకుంటాడు. అయితే సేఫ్టీ వాడినప్పటికీ కూడా హీరో భార్య ప్రెగ్నెంట్ అవుతుంది.

దీంతో ఆ కం*మ్ కంపెనీపై కేసు వేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథగా తెలుస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుండి ఈ సినిమా చాలా ఫన్నీగా ఉంటుందట. ఎక్కడా కూడా బోర్ కొట్టదు అని తెలుస్తుంది.హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కామెడీ సీన్స్, బాస్ గా పవన్ కుమార్ అల్లూరి చేసిన కామెడీ, సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ (Vennela Kishore)… సుహాస్..ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. కోర్టు సన్నివేశాలు కూడా అలరిస్తాయని తెలుస్తుంది.

క్లైమాక్స్ లో చిన్నపాటి మెసేజ్ కూడా ఇప్పటి యువతరాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. మొత్తంగా ‘జనక అయితే గనక’ ఈ దసరాకి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉంటాయేమో చూడాలి.












