గోపీచంద్ – నయనతార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. ‘జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ పతాకం పై తాండ్ర రమేష్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 2011 లో మొదలైంది. అప్పటి నుండీ మూలనపడి ఉన్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా మళ్ళీ ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు ఆటంకాలన్నీ తొలగిపోవడంతో అక్టోబర్ 8న రిలీజ్ చేశారు.పాత సినిమా కావడం పైగా పోటీగా ‘కొండపొలం’, ‘డాక్టర్ వరుణ్’ వంటి సినిమాలు ఉండడంతో ‘ఆరడుగుల బుల్లెట్’ ను పెద్దగా జనాలు పట్టించుకోలేదు. మాస్ సెంటర్స్ లో కలెక్షన్లు పర్వాలేదు అనిపించినా…మల్టీప్లెక్స్ ఆడియెన్స్ మాత్రం ఈ చిత్రాన్ని పూర్తిగా లైట్ తీసుకున్నారనే చెప్పాలి. దాంతో ఓ మోస్తారు కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం.
ఇక ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.29 cr
సీడెడ్
0.18 cr
ఉత్తరాంధ్ర
0.14 cr
ఈస్ట్
0.12 cr
వెస్ట్
0.08 cr
గుంటూరు
0.08 cr
కృష్ణా
0.09 cr
నెల్లూరు
0.06 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
1.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్
0.05 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
1.09 cr
‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రానికి రూ. 2.95 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు రూ. 3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 1.09 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు ఇంకా రూ. 1.91 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది.ప్రమోషన్స్ కనుక చేసి ఉంటే ఈ చిత్రం కాస్త బెటర్ గా పెర్ఫార్మ్ చేసుండేదేమో..!