ప్రస్తుతం అభివృద్ధి చెందిన ఈ టెక్నాలజీని ఎంతోమంది చెడుగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విధంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారి ఫోటోలు వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ముఖ్యంగా డీప్ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ విధంగా డీప్ ఫేక్ వీడియోలు బారిన పడినటువంటి వారిలో రష్మిక మందన్న ఒకరు.
బ్రిటీష్ మోడల్‌కు రష్మిక ఫేస్ పెట్టి డీప్ ఫేక్ తయారు చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అయితే ఈ వీడియో పై మొదటి సారి అమితాబచ్చన్ స్పందిస్తూ ఇలాంటి చర్యలను ఖండించారు అనంతరం ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చాయి. సెలబ్రిటీల పట్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిని ఆదుపులోకి తీసుకోవాలని భావించారు అయితే రష్మిక డీప్ ఫేక్ వీడియో పై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు
అయితే చివరికి ఈమె (Rashmika) డీప్ ఫేక్ వీడియోని క్రియేట్ చేసినటువంటి వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఇలాంటి చర్యలకు పాల్పడినది ఏపీకి చెందిన వ్యక్తి అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. అయితే ఈ వ్యక్తి ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది.