2020లో వచ్చిన “భీష్మ” తర్వాత సరైన హిట్ కొట్టలేకపోయాడు నితిన్ (Nithiin). అయినా నితిన్ కి ఒక హిట్ తర్వాత కనీసం మూడు నాలుగు ఫ్లాపులు కొట్టడం అలవాటే. అయితే.. ఇప్పటివరకు సినిమాలు ఫ్లాపయినా నితిన్ కి పెద్దగా బ్యాడ్ నేమ్ రాలేదు. కానీ.. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమా మాత్రం నితిన్ ఇమేజ్ కి డెంట్ పెట్టింది. ముఖ్యంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ & ఒక పాట నితిన్ కి వరుసగా 13 ఫ్లాపులు వచ్చినా తీసుకురానంత బ్యాడ్ నేమ్ తీసుకొచ్చింది.
ఆ తర్వాత వస్తున్న సినిమా “రాబిన్ హుడ్” (Robinhood) . ఈ రాబిన్ హుడ్ కూడా విడుదల విషయంలో చాలా ఇబ్బందులుపడుతూ.. పలుమార్లు వాయిదాపడి మరీ ఎట్టకేలకు మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే.. సోలోగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాకి అనుకోని విధంగా మూడు సినిమాలు పోటీకి దిగాయి. మోహన్ లాల్ (Mohanlal) “ఎంపురాన్”,(L2: Empuraan) విక్రమ్ “వీర ధీర శూర” వంటి డబ్బింగ్ సినిమాలతోపాటు.. “మ్యాడ్ స్క్వేర్” (Mad Square) కూడా పోటీకి దిగాయి.
దాంతో “రాబిన్ హుడ్”కి కొత్త టెన్షన్ మొదలైంది. ముందు సోలో రిలీజ్ అనుకున్నప్పటికీ.. సడన్ గా ఇలా మూడు పెద్ద సినిమాలు పోటీకి దిగడంతో వేరే ఆప్షన్ లేక తలపడాల్సి వచ్చింది. సోలోగా రిలీజ్ అయ్యుంటే.. యావరేజ్ కంటెంట్ తో కూడా మినిమం రేంజ్ హిట్ అందుకునేవాడు నితిన్.
కానీ.. ఇప్పుడు మరో 3 సినిమాలు పోటీపడడంతో కంటెంట్ అత్యద్భుతంగా ఉండి, సినిమా హైలీ ఎంగేజింగ్ & ఎంటర్టెనింగ్ గా లేకపోతే మాత్రం ప్రేక్షకుల్ని మెప్పించి, థియేటర్లకు రప్పించడం, కూర్చోబెట్టడం అనేది కష్టం. నితిన్ కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ అయితే సరిపోదు కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. మరి నితిన్ ఏమేరకు నెగ్గుకొస్తాడు అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.