కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) రేణుక స్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ‘తన విడాకులకు కారణం పవిత్ర అంటూ ట్రోల్ చేసిన అభిమానిని తన మనుషులతో చావగొట్టించి ప్రాణాలు తీశాడు దర్శన్’ వంటి ఆరోపణల కారణంగా దర్శన్ అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆధారాలన్నీ దర్శన్ కి వ్యతిరేకంగా ఉండటంతో అతనికి జైలు శిక్ష పడింది. కొన్ని నెలల నుండి దర్శన్ బళ్ళారి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
Darshan
దర్శన్ తరఫు న్యాయవాది సి.వి.నగేష్ కొన్నాళ్లుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ కోర్టు దర్శన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ వస్తోంది. అయితే కొంతకాలంగా దర్శన్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, అత్యవసర చికిత్స అందకపోతే అతనికి పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని… దర్శన్ తరఫు న్యాయవాది సి.వి.నగేష్ మళ్ళీ బెయిల్ కి అప్లై చేయడం జరిగింది.
ఇందుకు కోర్టు కూడా సానుకూలంగా స్పందించి దర్శన్ కి బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం. 3 నెలల పాటు దర్శన్ కి బెయిల్ ఇవ్వాలని పిటిషన్లో న్యాయవాది పేర్కొన్నట్టు తెలుస్తుంది. ట్రీట్మెంట్ అనంతరం దర్శన్ కి బెడ్ రెస్ట్ అవసరం కాబట్టి.. కోర్టు కూడా ఇందుకు అంగీకరించినట్టు స్పష్టమవుతుంది. అందులోనూ బళ్లారిలో న్యూరో నావిగేషన్ అనేది అందుబాటులో లేదు కాబట్టి..
మైసూర్ లో ఉన్న అపోలో హాస్పిటల్లో దర్శన్ కి చికిత్స అందించాలని కూడా సి.వి.నగేష్ బెయిల్ పిటిషన్లో కోరినట్టు సమాచారం. ఏదైతేనేం మొత్తానికి దర్శన్ కి బెయిల్ వచ్చింది. అతన్ని అమితంగా అభిమానించే అభిమానులకి ఇది హ్యాపీ న్యూస్. కానీ రేణుక స్వామి.. వంటి అభిమానులకి ఇది ఎలాంటి న్యూస్ అనేది అర్థం చేసుకోవచ్చు.