ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, నటుడు అయిన ఆర్. నారాయణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి రెడ్డి చిట్టెమ్మ ఈరోజు కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆమెను ఆంధ్రప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కాకినాడ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె మంగళవారం నాడు తుది శ్వాస విడిచారు అని సమాచారం.
నారాయణమూర్తి తల్లి మృతి పట్ల కొందరు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతుండగా. చిరంజీవి ప్రత్యేకంగా ఆయనకు ఫోన్ చేసి పరామర్శించినట్టు తెలుస్తుంది. ఆర్.నారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలంలోని మల్లంపేట గ్రామానికి చెందిన వ్యక్తి అని ఎక్కువ మందికి తెలిసుండదు. ఇతను ఓ పేద రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి .ఇతని తల్లి రెడ్డి చిట్టెమ్మ.. కాగా తండ్రి పేరు రెడ్డి చిన్నయ్య నాయడు. రౌతులపూడి లో 5వ తరగతి వరకు చదువుకున్నారు ఆర్.నారాయణ మూర్తి.
చిన్నప్పటి నుండి ఎన్టీఆర్, నాగేశ్వరరావు సినిమాలు చూస్తూ పెరిగిన నారాయణ మూర్తి ….వారిని ఇమిటేట్ చేస్తూ నటన జీవితాన్ని ప్రారంభించాడు. నారాయణమూర్తికి సామాజిక స్పృహ ఎక్కువ. సామాన్య ప్రజలకు జరిగే అన్యాయాలను గమనించి, విప్లవ ఉద్యమాల ఆయన ఆకర్షితుడయ్యాడు. 1972 లో ఇంటర్మీడియట్ పరీక్షలు అవ్వగానే అందులో ‘పాస్ అవ్వను’ అని గ్రహించి ఆయన మద్రాసు వెళ్ళిపోయాడు.
ఎన్నో కష్టాలు పడి సినిమాల్లో మంచి నటుడిగా ఎదిగారు. కానీ ఆయన సినిమాల పరంగా సంపాదించింది ఏమీ లేదు. సంపాదించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఈయన పెళ్లి చేసుకోలేదు సరి కదా కనీసం ఈయనకి హైదరాబాద్ లో సొంత ఇల్లు కూడా లేదు.