తమిళ నటి అభినయ (Abhinaya) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ‘నేనింతే’ (Neninthe) ‘కింగ్'(King) ‘శంభో శివ శంభో’ (Sambho Siva Sambho)’దమ్ము’ (Dammu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ‘ఢమరుఖం’ (Damarukam) ‘ధృవ’ (Druva)వంటి చిత్రాల్లో అతి ముఖ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఇక ఈమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చాలా మందికి తెలుసు. అభినయకి పుట్టుకతోనే చెవుడు, మూగ కలిగిన వ్యక్తి. అయినప్పటికీ తన టాలెంట్ తో మంచి మంచి పాత్రలు చేస్తూ పాపులారిటీ సంపాదించుకుంది.
ఇదిలా ఉండగా.. అభినయకి ఇటీవల నిశ్చితార్థం జరిగినట్లు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మొదలవ్వడానికి కారణం కూడా అభినయనే. అవును సోషల్ మీడియాలో ఆమె ఇటీవల ఓ ఫోటోని షేర్ చేసి ఎంగేజ్డ్ అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఆమె ఫాలోవర్స్ అంతా ‘కంగ్రాట్స్’ చెబుతూ ఆ ఫోటోని వైరల్ చేశారు. కానీ అభినయ తనకు కాబోయే భర్త ఎవరు? అనేది రివీల్ చేయలేదు. అయితే కార్తీక్ అనే వ్యక్తితో ఆమె 15 ఏళ్లుగా ప్రేమలో ఉందట.
అతను హైదరాబాద్ కి చెందిన వ్యక్తే కావడం గమనార్హం. ఇతనొక బిజినెస్ మెన్ అని తెలుస్తుంది. ఇటీవల కార్తీక్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అభినయ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. దీంతో అందరికీ వీళ్ళ గురించి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది. వీరిద్దరూ క్లోజ్ గా దిగిన కొన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5