నాని (Nani) సమర్పణలో ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ పై ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) నిర్మాణంలో ‘కోర్ట్’ (Court) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకి ‘స్టేట్ వర్సెస్ నో బడీ’ అనేది ఉప శీర్షిక. ‘కథలెన్నో’ అనే పాట, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin) సంగీత దర్శకుడు. రామ్ జగదీష్ దర్శకుడు. మార్చి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు రోజుల ముందే ప్రిమియర్స్ కూడా వేశారు.
మొదటి షోతోనే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. హోలీ పండుగ సెలవు ఈ సినిమాకి కలిసొచ్చింది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.35 కోట్లు |
సీడెడ్ | 0.38 కోట్లు |
ఆంధ్ర(టోటల్) | 1.16 కోట్లు |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.89 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
1.4 కోట్లు |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.29 కోట్లు(షేర్) |
‘కోర్ట్’ సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకు రూ.4.29 కోట్ల షేర్ ను రాబట్టి 50 శాతం పైనే రికవరీ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.