మీటూ మూమెంట్ సమయంలో సినీ పరిశ్రమలోని నటీమణులు, సింగర్స్, డ్యాన్సర్స్.. ఇలా చాలామంది తాము ఎదుర్కున్న చేదు అనుభవాలను చెప్పడానికి ముందుకొచ్చారు. కేవలం అదే సమయంలో మాత్రమే కాదు.. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో పరిశ్రమలో తాము ఎదుర్కుంటున్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను బయటపెడుతూనే ఉన్నారు నటీమణులు.. తాజాగా మరో సీనియర్ హీరోయిన్.. తాను పాల్గొన్న ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ‘తమ్ముడు’ ఫేమ్ అదితి గోవిత్రికర్.
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘తమ్ముడు’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించింది బాలీవుడ్ భామ అదితి గోవిత్రికర్. ఆ సినిమాలో తన పాత్ర గురించి ఎక్కువమంది ప్రేక్షకులకు గుర్తులేకపోయినా.. ‘వయ్యారీ భామ నీ హంస నడక’ అంటూ సాగే తన పాట మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులందరికీ గుర్తుంది. ఇక ఈ హీరోయిన్.. ఒక పెద్ద సినిమా షూటింగ్ కోసం నేను సౌత్ ఆఫ్రికా వెళ్లాను. ఆ సమయంలో ఆ వ్యక్తి అనవసరంగా హింట్స్ ఇస్తున్నాడని నేను అర్థం చేసుకోలేకపోయాను.
అందుకే నేను ఎక్కువగా మాట్లాడకుండా తన మొహం మీదే నవ్వి ‘నీకైమైనా పిచ్చా?’ అని అడిగి వెళ్లిపోయాను. కానీ అలా అనడం వల్ల తన ఇగో హర్ట్ అయ్యింది. ఆ తరువాతి రోజే నా టీమ్‌ను, నన్ను ప్యాకప్ చేసుకొమని చెప్పి ముంబాయ్ పంపించేశారు. ఆ సమయంలో అసలు ఏం జరిగిందో నేను అర్థం చేసుకోలేకపోయాను’’ అని బయటపెట్టింది అదితి. అలాగే‘‘మేము ఒకసారి హోటల్‌లో కలిశాము. ఆ రోజుల్లో చాలా మీటింగ్స్ హోటల్స్‌లో జరిగేవి.
అది కామన్. అదే సందర్భంలో నేను నా (Aditi Gowitrikar) తండ్రితో చాలా క్లోజ్‌గా ఉంటాను అని ఆ వ్యక్తితో చెప్పాను. అయితే ఇక మంచిదే. ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి రేపు పొద్దున వస్తానని చెప్పు అన్నాడు. నాకు ఒక్కసారిగా కన్నీళ్లు ఆగలేదు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను. ఇలాంటి విషయాలను మనకు వెంటనే అర్థం కావు. ఆ తర్వాత అతడు అన్న మాటల వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటో నాకు అర్థమయ్యింది’’ అని వివరించింది.