ఆ హీరోయిన్ పవన్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకుందా?

పవన్ క్రిష్ కాంబో మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ నత్తనడకన సాగుతోంది. పవన్ వేరే సినిమాల షూటింగ్ లతో బిజీ అవుతుండటంతో ఈ ఏడాది ఈ సినిమా విడుదలవుతుందా? లేదా? అనే ప్రశ్న వినిపిస్తోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఎంపికైన తర్వాత నిధి అగర్వాల్ కు కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లను నిధి అగర్వాల్ రిజెక్ట్ చేసింది.

అయితే నిధి అగర్వాల్ కు ఇప్పుడు ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. పవన్ సినిమా హిట్టైతే మాత్రమే ఈ బ్యూటీకి మూవీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అటు క్రిష్ పరిస్థితి సైతం ఇదే విధంగా ఉంది. 250 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పవన్ సైతం ఈ సినిమాతో ఇతర భాషల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని తన సినిమాలకు డిమాండ్ పెరుగుతుందని నమ్మకంతో ఉన్నారు.

నిధి అగర్వాల్ ఆశలను ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. నిధి రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగానే ఉందని సమాచారం. తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలే చేసినా ఆ సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు సైతం 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించే సినిమా కెరీర్ పరంగా కీలకం అనే సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం భిన్నమైన కథలపై దృష్టి పెడుతున్నారు.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. పవన్ 2024 నాటికి ఏకంగా 4 సినిమాలను రిలీజ్ చేయనున్నారని రిలీజ్ కానుంది. ఈ నాలుగు సినిమాలు ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తాయో చూడాలి. పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య మాత్రం అంచనాలను మించి పెరుగుతోంది. పవన్ రాజకీయాల్లో కూడా సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus