పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ మరియు వ్యాంప్ రోల్స్ లో నటించి పాపులర్ అయిన జ్యోతి అందరికీ సుపరిచితమే. ‘పెళ్ళాం ఊరెళితే’ ‘కాంచనమాల కేబుల్ టీవీ’ ‘ హంగామా’ ‘ఎవడి గోల వాడిది’ ‘గుడుంబా శంకర్’ ‘కెవ్వు కేక’ వంటి సినిమాల్లో నటించింది. అటు తర్వాత ఈమెకు అవకాశాలు కరువయ్యాయి. అయితే ‘బిగ్ బాస్ సీజన్ 1’ లో ఎంట్రీ ఇచ్చి ఈమె మళ్ళీ వార్తల్లో నిలిచింది. అయితే ఆమె వారం రోజులు కూడా హౌస్ లో ఉండలేకపోయింది.
అందుకు కారణం ఈమె నోటి దురుసు అని అంతా అన్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత ఈమెలోని కొత్త యాంగిల్ ను చూశారు జనాలు. ఈమె మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడకుండా.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చిపోవడం వల్లే ఇలా వివాదాల్లో చిక్కుకుంటుంది అని అంతా భావించారు. ఇక రామ్ గోపాల్ వర్మతో డాన్స్ వీడియోతో ఈమె ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని ఇప్పుడు వైరల్ గా మారాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :