దర్శకుడు సూర్య కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఎప్పుడో 2003లో సుమంత్ హీరోగా వచ్చిన సత్యం అనే హిట్ మూవీని తెరకెక్కించింది ఇతడే. ఆ తరువాత ఆయన చేసిన సినిమాలన్నీ ప్లాప్ కావడంతో పాటు, దర్శకుడిగా సినిమా చేసి చాలా కాలం అవడంతో ఆయన్ని అందరూ మరచిపోయారు. బిగ్ బాస్ హౌస్ లో సూర్య కిరణ్ ని చూసిన తెలుగు ఆడియన్స్, ఎవరితను అనుకున్నారు. నిజానికి సూర్య కిరణ్ బాల నటుడిగా 200లకు పైగా చిత్రాలలో నటించాడు. చిరంజీవి హీరోగా వచ్చిన రాక్షసుడు, దొంగ మొగుడు, కొండవీటి దొంగ సినిమాలలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది.
ప్రేక్షకులకు తెలియని మరో విషయం తెలుగువారికి బాగా పరిచయం ఉన్న హీరోయిన్ కళ్యాణి భర్తనే సూర్య కిరణ్. అప్పట్లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. సోషల్ మీడియా విప్లవం లేని ఆ రోజుల్లో వీరి పెళ్లి పెద్దగా ప్రచారం కాలేదు. ఐతే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కళ్యాణితో ప్రేమ వివాహం, విడాకులు, వీరి మధ్య తలెత్తిన సమస్యలు పూసగుచ్చినట్లు చెవుతున్నాడు. కెరీర్ పరంగా ఫెయిల్ కావడం, ఆర్థికంగా నష్టపోవడం వలనే కళ్యాణి నన్ను వదిలేసిందని సూర్య కిరణ్ చెప్పడం జరిగింది. ఒకప్రక్క కళ్యాణిపై తనకు ఎనలేని ప్రేమ ఉంది అంటూనే ఆమెను కొంచెం డిఫేమ్ చేస్తున్నాడు.

సూర్య కిరణ్ వ్యవహారం కల్యాణికి తలనొప్పిగా మారింది. ఆ వ్యక్తిగత జీవితం ఏమిటనేది ప్రేక్షకులు ఎప్పుడో మరచిపోయారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి 9ఏళ్ళు అవుతుండగా ప్రేమ, పెళ్లి, విడాకులు లాంటి విషయాలు తెరపైకి రావడం ఆమెను ఇబ్బంది పెడుతుంది. మీడియా సైతం సూర్య కిరణ్ వ్యాఖ్యలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో రోజుకు అనేక కథనాలు వీరి బంధంపై వస్తున్నాయి.
1

2

3

4

5

6

7

8

9

Tanish, Surya Kiran, Kalyani at Nuvvu Sarigama Nenu Padanisa Movie Opening Stills
10

11

12

13

14

15

Most Recommended Video
‘బిగ్‌బాస్’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!
