”థియేటర్లు మూసేయాలనుకుంటున్నారా..?”

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ను అందరూ ఫైర్ బ్రాండ్ అంటుంటారు. ఇండస్ట్రీలో జరిగే సంఘటనలతో పాటు సామాజిక అంశాలపై కూడా ఆమె స్పందిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ప్రభుత్వం పనితనాన్ని ఎండగట్టింది. థియేటర్లు తెరవకపోవడంపై సోషల్ మీడియా వేదికగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తరువాత ఎన్నో రాష్ట్రాలు థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతిచ్చినప్పటికీ.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంకా సినీరంగంపై వివక్ష చూపుతోందని విరుచుకుపడింది.

ఎన్నో సినిమాలు విడుదలకు వేచి ఉన్న తరుణంలో థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వకుండా వాటిని పూర్తిగా మూసేయళ్ళని కంకణం కట్టుకున్నట్లుగా ఉందని విమర్శలు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చిత్రపరిశ్రమని వివక్షతో చూస్తున్నప్పటికీ ఎవరూ మాట్లాడే ధైర్యం చేయకపోవడం విడ్డూరంగా ఉందని తెలిపింది. అయితే ఇటీవల ‘తలైవి’ సినిమా రిలీజ్ విషయంలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం కంగనా అభ్యర్ధనను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆమె ఇలాంటి విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం కంగనా.. ‘ ‘ఢాకాడ్’, ‘తేజస్’, ‘ఎమర్జెన్సీ’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. రీసెంట్ గా పౌరాణిక సినిమా ‘సీత’లో నటించడానికి ఒప్పుకుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Share.