పెళ్ళైన పదేళ్లకు తల్లి కాబోతుందట.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సినిమా వాళ్లకు సంబంధించి ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు అయితే మరీను. ఇటీవల కాలంలో వరుసగా ప్రెగ్నెన్సీ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే చాలు వెంటనే వాళ్ళు గర్భం దాల్చినట్టు వార్తలు పుట్టుకొస్తున్నాయి. అవి నిజమైతే సెలబ్రిటీలు కొన్నిరోజులు మౌనంగా ఉండి ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తున్నారు.

లేదు అంటే వెంటనే రియక్ట్ అయ్యి అవి అవాస్తవాలు అని తేల్చి చెప్పేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రానా, ఆది పినిశెట్టి ల భార్యలు గర్భం దాల్చినట్టు ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు అని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మరీ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో నటి గర్భం దాల్చినట్టు ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే.. చిన్నారి పెళ్ళకూతురు నేహా మర్ధా తల్లి కాబోతుంది.

పెళ్ళైన పదేళ్ల తర్వాత ఈమె తల్లి కాబోతుంది. ఇప్పుడు ఆమె వయసు 35 ఏళ్ళు. తన భర్త ఆయుష్మాన్ అగర్వాల్ తో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోలను ఆమె షేర్ చేయగా. అందులో ఈమె బేబీ బంప్ తో కనిపించింది. అంతేకాకుండా 2023 లో తనకు డెలివరీ డేట్ ఇచ్చినట్టు కూడా క్లారిటీ ఇచ్చేసింది. ఈమె చిన్నారి పెళ్ళికూతురుతో పాటు పలు డాన్స్ షోలలో కూడా ఈమె పార్టిసిపేట్ చేసింది. ఇక ఈమె తల్లికాబోతున్న విషయం పై ఈమె ఫాలోవర్స్ సంతోషం వ్యక్తం చేస్తూ.. ఈమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆమె బేబీ బంప్ ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus