Pragathi: నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి ప్రగతి..!

టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో కొన్ని తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె ..ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడింది. ఇప్పటికే 100 కి పైగా చిత్రాల్లో నటించిన ప్రగతి.. తల్లి, పిన్ని, అత్త, చిన్నమ్మ వంటి పాత్రలకు బాగా ఫేమస్ అనిపించుకుంది. ‘దూకుడు’ ‘బాద్ షా’ ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి చిత్రాల్లో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న

ఈమె ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రని కూడా అద్భుతంగా పోషించింది. కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ టైం లో ఈమె పోస్ట్ చేసిన జిమ్ వర్కౌట్ వీడియోలు, డాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. దీంతో క్రమంగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది అంటే ట్రోలింగ్ కూడా అదే విధంగా పెరుగుతుంది అనేది అందరికీ తెలిసిన సంగతే..! ప్రగతి పోస్ట్ చేసే వీడియోలకు కూడా ట్రోలింగ్ జరుగుతుంది.

కానీ దానిని ఆమె ఏమాత్రం లెక్కచేయదు. అందుకే ఆమె ప్రొఫైల్ నేమ్ కూడా ‘ప్రగ్ స్ట్రాంగ్’ అని పెట్టుకుంది. అందుకు తగ్గట్టే ఈమె అప్పుడప్పుడు నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈమె ఓ రీల్ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు..

‘నువ్వేమైనా యంగ్ అమ్మాయివి అనుకుంటున్నావా?’ అంటూ సెటైర్లు వేశారు. దీనికి ప్రగతి ‘యంగ్‌గా కనిపించాలి అనేది నా ఉద్దేశం కాదు దేశోద్దారకులారా! నా జీవితం నాకు నచ్చినట్టు జీవిస్తున్నాను’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus