Sai Pallavi: సాయిపల్లవి ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అందం, అభినయంతో మెప్పించే హీరోయిన్ గా సాయిపల్లవికి పేరుంది. టాలీవుడ్ హీరోయిన్లలో ఎక్కువమంది హీరోయిన్లు జిమ్ లో గడపడం ద్వారా తమ లుక్ ను మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. బాడీ షేప్ కోసం, బరువు తగ్గడం కోసం ఎక్కువమంది హీరోయిన్లు జిమ్ పై ఆధారపడతారు. అయితే స్టార్ హీరోయిన్ సాయిపల్లవి మాత్రం తనకు జిమ్ అంటే అస్సలు పడదని చెబుతున్నారు. తనకు డ్యాన్స్ పెద్ద వ్యాయామం అని అంతకు మించి వ్యాయామం అవసరం లేదని సాయిపల్లవి వెల్లడిస్తున్నారు.

షూటింగ్ గ్యాప్స్ లలో కూడా డ్యాన్స్ చేయడానికి తాను ఇష్టపడతానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు. డ్యాన్స్ తో పాటు మెడిటేషన్ చేయడం ద్వారా శాకాహారం తీసుకోవడం ద్వారా సాయిపల్లవి అందంగా కనిపిస్తుండటం గమనార్హం. చెమట్లు కక్కేలా డ్యాన్స్ చేయడం వల్లే సాయిపల్లవి మరింత అందంగా కనిపిస్తున్నారు. డ్యాన్స్ తో పాటు తాను మెడిటేషన్ కూడా చేస్తానని తక్కువ ఉడికించిన శాకాహారంను మాత్రమే తాను తీసుకుంటానని సాయిపల్లవి వెల్లడిస్తుండటం గమనార్హం. అరగంట సమయం డ్యాన్స్ చేయడం వల్ల 400 కెలోరీల కొవ్వు కరుగుతుంది.

డ్యాన్స్ చేయడం వల్ల ఫిట్ గా ఉండటంతో పాటు ఒత్తిడిని కూడా దూరం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. భవిష్యత్తులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు సాయిపల్లవిని ఫాలో అవుతారేమో చూడాల్సి ఉంది. లవ్ స్టోరీ హిట్ తో సాయిపల్లవికి క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఏపీలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో లవ్ స్టోరీ సినిమా భారీగా లాభాలను తెచ్చిపెట్టింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus