Samantha: అలాంటి సినిమాలతో ముందుకు వస్తానన్న సామ్!

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత అంచనాలకు అందని స్థాయిలో ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. పుష్ప ది రైజ్ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పారని వార్తలు వచ్చిన సమయంలో చాలామంది సమంతను విమర్శించారు. అయితే ఆ పాట ఊహించని స్థాయిలో హిట్ కావడంతో పాటు సమంతపై ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. సమంత ప్రస్తుతం స్విట్జర్లాండ్ వెకేషన్ లో ఉన్నారు. స్విట్జర్లాండ్ లో స్కీయింగ్ చేసిన సమంత ఆ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం యశోద మూవీలో నటిస్తున్న సామ్ వెకేషన్ కోసం స్విట్జర్లాండ్ కు వెళ్లారు. విజయ్ దేవరకొండ సినిమాలో కూడా సమంత స్పెషల్ సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సమంత సన్నిహితులు మాత్రం సామ్ మరో స్పెషల్ సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. సమంత నటించిన శాకుంతలం సినిమా, యశోద సినిమా కొన్ని రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదల కానున్నాయి.

ఎం.ఎస్. ధోనీ చేసిన యాడ్ గురించి తాజాగా సమంత రియాక్ట్ అయ్యారు. ఎం.ఎస్.ధోని అన్ అకాడమీ యాడ్ లో నటించగా ఆ యాడ్ లో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకూడదని ధైర్యంగా ముందుకు వెళ్లాలనే మెసేజ్ ను ఇచ్చారు. ఆ యాడ్ గురించి సమంత రియాక్ట్ అవుతూ ఇది లైఫ్ కు ఒక పాఠం నేర్పిందని చెప్పుకొచ్చారు. ఎన్ని కష్టాలు వచ్చినా లైఫ్ లో ముందుకు సాగాలని యాడ్ లో చూపించారని ఇలాంటి స్పూర్తి నింపే సినిమాలతో తాను ప్రేక్షకుల ముందుకు వస్తానని సమంత కామెంట్లు చేశారు.

సమంత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంతకు బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి సినిమా ఆఫర్లు వస్తుండగా సినిమాసినిమాకు సమంతకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus